Bonalu 2025: బోనమెత్తడానికి సిద్దమవుతున్న సికింద్రాబాద్.! పనులను పర్యవేక్షించిన తలసాని.!

Bonalu 2025: ఆషాడమాసం వచ్చేస్తోంది. అమ్మవారి ఆలయాలు బోనాల పండుగకు సిద్దమవుతున్నాయి. ఇటు అధికారులు అటు నాయకులు హడావుడి చేస్తున్నారు. తెలంగాణలో అమ్మవారి బోణాలు ప్రత్యేక ఆద్యాత్మికను సంతరించుకుంటాయి. ప్రతీఏటా కులబేధాలు లేకుండా అమ్మవారికి బోనం సమర్పిస్తారు భక్త జనం. బోనం అంటే ఏంటో కాదు ఇంట్లో తయారు చేసిన నైవేధ్యాన్ని బోనం రూపంలో అమ్మవారికి సంర్పించడం. ఇలాంటి వైవిధ్యమైన పండుగ దేశంలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే గుడిలో కొలువైన అమ్మవారికి ఇంట్లో చేసిన నైవేద్యాన్ని పెట్టడానికి పురోహితులు ఒప్పుకోరు. ఇంట్లో అంటుడు ముట్టుడు సరిగ్గా ఉండదని పురోహితులు వాళ్ల ఇంట్లో తయారు చేసిన నైవేద్యాన్నే దేవుళ్లకు పెడతారు.
అందుకు విప్లవాత్మక పండగ బోనాలు…
కులాలకు అతీతంగా తెలంగాణలో అమ్మవారికి ప్రేమపూర్వకమైన భక్తితో ఇంట్లోనే నైవేద్యాన్ని తయారుచేసుకుని డప్పు చప్పుల్లతో పోతురాజుల హాహాకారాలతో చిన్నపిల్లల దగ్గరనుంచి చర్మం ముడతలు పడిన ముదుసలివరకు కట్టిన చీర కట్టకుండా అమ్మవారినే తమ అమ్మగా ఆడబడుచుగా కొలిచి భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పిస్తారు. అలాంటి పర్వదినాన్ని తెలంగాణ ప్రతీ పల్లె పట్టనం అని తేడా లేకుండా జరుపుకుంటారు.
సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి గుడిలో బోనాలు చాలా ప్రక్యాతిచెందినవి. ఇక్కడికి గవర్నర్, ముఖ్యమంత్రులు, సామాన్య జనం అనే తేడా లేకుండా… బోనాలను తలపై ఎత్తుకుని నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. తలిస్తేచాలు కొంగుబంగారమయ్యే తల్లి కృపకు పాత్రులవుతారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో ఆలయ పరిసరాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. మహంకాళి బోనాలను ఘనంగా జరపాలని ఆయన కోరారు. అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాలను పరిశీలించారు. ఆలయంలో నెలకొన్న సమస్యలను పండుగలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని తలసాని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు.