Published On:

Rahul Gandhi : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం ఇష్టం లేదు  : రాహుల్‌ గాంధీ

Rahul Gandhi : బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం ఇష్టం లేదు  : రాహుల్‌ గాంధీ

Rahul Gandhi On Amit Shah : విదేశీ భాషలకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్‌ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లిష్ భాషలో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు త్వరలో వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై లోక్‌సభలో పతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదని, విద్యార్థుల సాధికారతకు చిహ్నమన్నారు. ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థికి ఇంగ్లిష్ భాష అవసరం ఎంతో ఉందన్నారు. మాతృ భాషతోపాటు ఇంగ్లిష్ తప్పకుండా నేర్పాలని సూచించారు. ఆంగ్ల భాష విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, ఉపాధిని కల్పిస్తుందని తెలిపారు.

 

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఇష్టం లేదని విమర్శించారు. చదువుకు దూరం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిఒక్కరికి మాతృభాష ఎంత ముఖ్యమో.. ఇంగ్లిష్ భాష కూడా అంతే ముఖ్యమన్నారు. దేశంలోని ప్రతి భాషకు ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉన్నాయని, మనం గౌరవించాలన్నారు. అదే సమయంలో ప్రపంచంతో పోటీ పడడానికి వీలుగా ఇంగ్లిష్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

 

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడారు. దేశంలో ఇంగ్లిష్‌లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయన్నారు. భారతదేశాన్ని, మన సంస్కృతిని, మతాన్ని అర్థం చేసుకునేందుకు ఏ పరాయి భాష అవసరం లేదన్నారు. విదేశీ భాషలతో సంపూర్ణ భారతీయ భావనను ఊహించుకోలేమన్నారు. ఇది ఎంత కష్టమో తనకు తెలుసని, అయినప్పటికీ ఇందులో భారత సమాజం విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: