Published On:

PAN Card 2025 Update: పాన్ కార్డుకు ఆధార్ లింక్ తప్పనిసరి.. జూలై 1 నుంచి కొత్త రూల్స్!

PAN Card 2025 Update: పాన్ కార్డుకు ఆధార్ లింక్ తప్పనిసరి.. జూలై 1 నుంచి కొత్త రూల్స్!

PAN Card 2025 Update: జూలై 1 నుంచి కొత్త పాన్ కార్డు (PAN Card) అప్లై చేసుకునే వారికి ఆధార్ (Aadhaar) తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ (1) ప్రకారం, జూలై 1, 2017 నుంచి పాన్ కార్డు అప్లై చేసుకునే ప్రతి వ్యక్తి తమ ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా సమర్పించాలి. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు కూడా జూలై 1, 2017 నాటికి తమ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయాలి. ఈ గడువును చాలా సార్లు పొడగించారు.

 

ఎందుకు తప్పనిసరి ?
ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ పాన్ కార్డులను అరికట్టవచ్చు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండటాన్ని నివారించవచ్చు. ఇది ట్యాక్స్ ఎగవేతను తగ్గించి, మనీ ట్రాన్ సాక్షన్లలో పారదర్శకతను పెంచడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా బ్లాక్ మనీని నియంత్రించడంలో కూడా ఇది ఒక ముఖ్యమైన అడుగు.

 

పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది ?
పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయకపోతే.. మీ పాన్ కార్డు రద్దు అవుతుంది. రద్దయిన పాన్ కార్డుతో మనీ ట్రాన్ సాక్షన్స్ చేయలేరు. ఉదాహరణకు, మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ వివరాలు తెలుసుకోవడం, ఆన్ లైన్ లో వస్తువులు కొనడం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం, అధిక మొత్తంలో డబ్బులు పంపించడం వంటివి చేయలేరు. అంతేకాకుండా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో కూడా సమస్యలు ఎదురవుతాయి.

 

ఆధార్ లింక్ ఎలా చేయాలి ?
ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయవచ్చు. అలాగే.. ఎస్‌ఎంఎస్ (SMS) ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం. కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇందుకోసం మీ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్, ఆధార్ కార్డులో ఉన్న మీ వివరాలు మాత్రమే అవసరం అవుతాయి.

ఇవి కూడా చదవండి: