Ghulam Nabi Azad : ప్రధాని మోదీ గొప్ప రాజనీతిజ్ఞుడు.. గులాంనబీ అజాద్
: ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాజీ కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రశంసలతో ముంచెత్తారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రధానిని ప్రతి అంశంలో నిలదీశానని అన్నారు.
Ghulam Nabi Azad : ప్రధానమంత్రి నరేంద్రమోదీని మాజీ కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రశంసలతో ముంచెత్తారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రధానిని ప్రతి అంశంలో నిలదీశానని అన్నారు. ఆర్టికల్ 370 కానీ సీఏఏ కానీయండి.. హిజాబ్ అంశంలో కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టానని చెప్పుకొచ్చారు. తాను ప్రవేశపెట్టిన బిల్లులు విఫలమయ్యాయి.. అయినా తాను మోదీకి క్రెడిట్ ఇస్తానని చెప్పారు ఆజాద్. ఎందుకంటే మోదీ గొప్ప రాజనీతిజ్ఞుడుగా వ్యవహరించారే తప్ప తనపై ఎప్పుడూ ప్రతీకారం తీసుకోవాలని ఆలోచించలేదన్నారు.
నేను ఒక్కడినే పార్టీ పెట్టుకున్నాను..(Ghulam Nabi Azad)
గులాం నబీ ఆజాద్ రాహుల్‌గాంధీ నాయకత్వంపై విబేధించి పార్టీకి రాజీనామా చేశారు. జీ 23 గ్రూపును ఏర్పాటుచేసి పార్టలో సంస్కరణలు తీసుకురావాలని, అంతర్గతంగా ఎన్నికలు జరపాలని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేసి పార్టీ నుంచి నిష్ర్కమించారు. బీజేపీతో సన్నిహితంగా మెలిగి కాంగ్రెస్‌పార్టీని అస్థిరపర్చడానికి ఆజాద్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శకు స్పందిస్తూ.. ఇవన్నీ అపరిక్వతమైనవి, తెలివి తక్కువ విమర్శలని తేలికగా కొట్టిపారేశారు. జీ 23ని . బీజేపీ అధికార ప్రతినిధులుగా భావిస్తే వారిని కాంగ్రెస్ ఎంపీలుగా ఎందుకు చేశారు. కొంత మందిని ఎంపీలు చేశారు.. కొంత మందిని సెక్రటరీలుగాను , ఆఫీస్ బేరర్స్‌గా తీసుకున్నారు. జీ 23 నుంచి తాను ఒక్కడినే బయటికి వచ్చి పార్టీ పెట్టుకున్నాను. మిగిలిన వారు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఈ విమర్శల్లో పసలేదన్నారు ఆజాద్.
నెహ్రూ, ఇందిర, రాజీవ్ ల స్దాయిలేదు..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆజాద్ సొంతంగా డెమెక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని జమ్ము కశ్మీర్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం ఒక పుస్తకం రాశారు. పుస్తకం పేరు ‘ఆజాద్ యాన్ ఆటోబయోగ్రఫీ “పేరు పెట్టారు. ఈ పుస్తకంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఇతరులతో తనకు ఉన్న సంబంధాల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో జరిగిన ముఖ్య సంఘటనలను, మిస్‌మేనేజ్‌మెంట్‌ల గురించి పుస్తకంలో ప్రస్తావించారు. నెహ్రూ, రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీలు ఎలాంటి షాక్‌లను అయినా తట్టుకోగలరు. వారికి ఆ ఓర్పు ఉంది. ప్రజల్లో మంచి మద్దతు ఉంది. ప్రజల్లో గౌరవం ఉంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులపై వారి ప్రభావం ఏ మాత్రం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న నాయకత్వం వారి కంటే పదిరెట్లు కష్టపడి చేస్తే కానీ ఆ స్థాయికి రాలేరని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌కు చురకలంటించారు. కాగా కోవిడ్ సమయంలో బోలెడంత సమయం దొరికింది అప్పుడ ఈ పుస్తకం రాశనని ఆయన చెప్పారు.రాజకీయాల్లో రావాలనుకున్న వారి కమిట్‌మెంట్ ఉండాలని, ఏదో నామ్‌కే వస్తే పార్టీ హెడ్ క్వార్టర్‌కు వెళ్లి ఇంటికి రావడం కాదని కొత్త రాజకీయాల్లోకి రావాలానుకునే వారికి ఆజాద్ సలహా ఇచ్చారు.