Last Updated:

Avalanche: సిక్కింలో భారీ హిమపాతం.. ఆరుగురు పర్యాటకుల మృతి.. 50 మంది గల్లంతు

మంగళవారం మధ్యాహ్నం సిక్కింలో భారీ హిమపాతం సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆరుగురు పర్యాటకులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. చాలా మంది పర్యాటకులు మంచు కింద చిక్కుకున్నారని అందోళన చెందుతున్నారు.

Avalanche: సిక్కింలో భారీ హిమపాతం.. ఆరుగురు పర్యాటకుల  మృతి.. 50 మంది గల్లంతు

Avalanche: మంగళవారం మధ్యాహ్నం సిక్కింలో భారీ హిమపాతం సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆరుగురు పర్యాటకులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. చాలా మంది పర్యాటకులు మంచు కింద చిక్కుకున్నారని అందోళన చెందుతున్నారు. వీరి సంఖ్య 50 కి పైగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సిక్కిం పోలీసులు, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ సిక్కిం, పర్యాటక శాఖ అధికారులు, వాహన డ్రైవర్లు సహాయక చర్యలు చేపడుతున్నారు.

కొనసాగుతున్న రెస్క్యూ కార్యక్రమాలు..(Avalanche)

క్షతగాత్రులను రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లోని ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ మరియు క్లియరెన్స్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి”అని ఇక్కడ సీనియర్ పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు. నాథు లా చైనా సరిహద్దులో ఉంది మరియు దాని సుందరమైన అందం కారణంగా ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది.JNM రోడ్డులో 14వ మైలు వద్ద మధ్యాహ్నం 12:20 గంటల ప్రాంతంలో హిమపాతం సంభవించింది.రోడ్డు నుండి మంచు తొలగింపు తర్వాత చిక్కుకుపోయిన 350 మంది పర్యాటకులు మరియు 80 వాహనాలను రక్షించారు.