Home / జాతీయం
Maharashtra Reports 1st Death Due To Guillain-Barre Syndrome: దేశంలో మరో వైరస్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ కారణంగా సోలాసూర్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ప్రధానంగా జీబీఎస్ కారణమని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసులు రాష్ట్రంలో విపరీతంగా పెరగడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూణేలో ఈ జీబీఎస్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 101 వరకు పెరిగాయి. […]
Government drafts rules for mandatory adoption of Indian Standard time: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాలు ఒకే ప్రామాణిక సమయంలో నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. ఇందులో అధికారిక ప్రభుత్వ విధులతో పాటు దేశాభివృద్ధికి దోహదపడే కీలక వాణిజ్య కార్యకలాపాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ముసాయిదా నిబంధనలపై ఫిబ్రవరి […]
Lala Lajpat Rai Birth Anniversary: స్వాతంత్య్రం అనేది బ్రిటిషర్లను బతిమాలితే వచ్చేది కాదని, భరతజాతిని చైతన్యపరచి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడితే తప్ప అది అసాధ్యమని నమ్మి, ఆ మార్గంలో నడిచి, జాతిని నడిపించిన యోధుడు లాలా లజపతిరాయ్. ‘ప్లీ.. పిటీషన్.. ప్రేయర్’ అనే బాటలో సాగుతున్న భారత జాతీయ కాంగ్రెస్ తీరు మార్చుకుని ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన నేతగానూ ఆయన గుర్తింపుపొందారు. అర్థించి తెచ్చుకునే స్వాతంత్య్రానికి ఏ విలువా ఉండదని స్పష్టం చేశారు. […]
PM Modi congratulates Ireland Micheal Martin as he wins a second term as Irish Prime Minister: ఐర్లాండ్ నూతన ప్రధానిగా మిచెల్ మార్టిన్ ఎన్నికయ్యారు. ఆయన రెండోసారి ప్రధానికి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఐర్లాన్ రాజధాని డబ్లిన్‌లో ఉన్న పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ తర్వాత మిచెల్ మార్టిన్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ […]
Five Dead in Massive Explosion in Ordnance Factory in Maharashtra Blast: మహారాష్ట్రలోని భండారా జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఘటనా స్థలంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే అగ్ని మాపక శాఖ సిబ్బంది చర్యలు చేపట్టింది. […]
The Visionary Patriot, Revolutionary Leader Netaji Subhash Chandra Bose: పరాయి పాలనలో మగ్గుతున్న భారతావనికి తిరిగి స్వపరిపాలన కావాలంటూ అనేక మంది నేతలు తమదైన రీతిలో పోరాటాలు చేశారు. వీరిలో కొందరు అహింసా మార్గాన్ని ఎన్నుకోగా, మరికొందరు సాయుధపోరాటం దిశగా అడుగులు వేశారు. తమ ప్రాణాలర్పించారు. ఆ సమయంలో దేశంలోనే అత్యుత్తన్న సర్వీసుగా భావించే ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర పోరాటంలో భాగం పంచుకుని, మరణించే నాటికి యావత్ భారతానికి తిరుగులేని నాయకుడని […]
Nitish Kumar’s JDU withdraws support for BJP-ruled Manipur: మణిపూర్‌లో చోటు చేసుకున్న ఒక రాజకీయ పరిణామం బుధవారమంతా వార్తల్లో నిలిచింది. మణిపుర్‌లోని బీజేపీ సర్కార్‌కు షాక్ ఇస్తూ ఆ ప్రభుత్వానికి నితీష్ కుమార్ తన మద్దతును ఉపసంహరించుకున్నారనే వార్తలు రోజంతా చర్చలకు దారితీశాయి. దీంతో కేంద్రంలోనూ ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటారని మీడియా వాళ్లు చర్చలతో ఊదరగొట్టారు. అయితే, తీరా అసలు సంగతి తెలుసుకుని ‘ఇంతేనా’ అనుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదీ జరిగింది.. మణిపుర్‌లోని […]
Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్ సమీపంలో కొందరు ప్రయాణికులు ట్రైన్ దిగేందుకు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ చైన్ లాగారు. వారు దిగి పక్కనున్న పట్టాలపై చేరుకోగా.. అదే సమయంలో దానిపై నుంచి వస్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటికి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.
Delhi Assembly Elections 699 candidates for 70 seats: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం వెల్లడించారు. 2020తో పోలిస్తే.. 2020 ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 672మంది అభ్యర్థులు ఈ సారి పోటీ చేసేవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సారి 981 […]
Road Accident In Karnataka five died: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు కర్ణాటకలోని హంపీ ప్రాంతానికి విహారయాత్రకు బయలుదేరారు. అయితే మంగళవారం అర్ధరాత్రి సింధనూరు సమీపంలో విద్యార్థుల వాహనం ప్రమాదానికి గురైంది. రాయిచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో […]