Home / జాతీయం
తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 34 మంది చనిపోయారని కల్కురిచి జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ గురువారం తెలిపారు. సుమారు 60 మంది ఆస్పత్రి పాలయ్యారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం మొత్తం 107 మందిని ఆస్పత్రిలో చేర్పించారు.
మన దేశంలో ఆమ్ ఆద్మీ ప్రాణానికి విలువ లేదని మరోసారి రుజువైపోయింది. ఇటీవలే పూనేలో ఓ సంపన్నుడి సుపుత్రుడు పూటుగా మందుకొట్టి రూ. 2.5 కోట్లు విలువ చేసే పొర్శ్చేకారును విపరీతమైన స్పీడ్‌తో నడుపుతూ... కారు ముందు వెళ్తున్న వ్యక్తి మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు అతని స్నేహితురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారీ వరదలకు సుమారు 15 జిల్లాల్లో 1.61 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపించింది.
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మేనేజర్ శ్రీధర్ బెంగుళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. శ్రీధర్ మృతదేహంతో పాటు సూసైడ్ నోటు, వీడియో మెసేజును పోలీసులు గుర్తించారు. తన చావుకు తానే కారణమని దర్యాప్తులో తన కుటుంబాన్ని చేర్చవద్దని లేఖలో శ్రీధర్ పేర్కొన్నారు.
బీహార్‌లోని అరారియా జిల్లాలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోవడం యొక్క షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వంతెన మొదట పూర్తిగా నీటిలో మునిగిపోయే ముందు పాక్షికంగా కూలిపోయింది.
ప్రశాంతంగా ఉన్న ఒడిషాలో మత ఘర్షణలు చెలరేగాయి. స్థానికంగా వచ్చే నీరు కాస్తా ఎర్రగా మారడంతో బక్రీద్ సందర్భంగా గో హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గాంధీ కుటుంబం నుంచి మరొకిరు రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ దక్షిణాదిన వాయనాడ్ నుంచి అటు ఉత్తరాది రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల భారీ మెజారిటీ గెలుపొందారు
నీట్ పరీక్షల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు కేంద్రప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు పంపించింది.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. లోకసభ కొత్త స్పీకర్ ఎంపిక కోసం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో మంత్రులు మంగళవారం సాయంత్రం సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించి అడపాదడపా వర్షాలు కురుస్తుంటే... అదే ఉత్తరాదిన మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది.