Home / జాతీయం
F-35 flight: సాంకేతిక కారణాలతో మూడు వారాలుగా కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన యుద్ధ విమానం ఎఫ్-35బి ఎట్టకేలకు కదిలింది. ఫ్లైట్ మరమ్మతుల కోసం నిపుణులు హ్యాంగర్‌కు తగిలించి పార్క్ చేసిన ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించారు. ఫైటర్ జెట్‌కు మరమ్మతులు చేసేందుకు యూకే నుంచి 24 మంది ఏవియేషన్ ఇంజినీర్ల బృందం ప్రత్యేక పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో ఆదివారం కేరళకు చేరుకుంది. విమానానికి […]
AAP MLA Chaitar Vasava Arrested: గుజరాత్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చైతర్ వాసవను పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అరెస్టు నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్మదా జిల్లాలోని దేడియాపడా నియోజకవర్గం పరిధిలో శనివారం ఓ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే చైతర్ వాసవ పాల్గొన్నారు. సమన్వయ కమిటీలో సభ్యుడిగా తనను నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సగ్బారా తాలూకా పంచాయతీ […]
BJP fires on CM Siddaramaiah: కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఇటీవల 20 మంది మృతిచెందారు. వారి మృతికి కొవిడ్ టీకాలు కారణమని చెప్పేందుకు ఆధారాలు లేవని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇటీవల హసన్ జిల్లాలో 20 మంది గుండెపోటుతో మృతిచెందారు. మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్ కారణం అయి ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తంచేశారు. మరణాలకు […]
Chandrachud: ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను ఖాళీ చేయాలని మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు ఓ లేఖను పంపింది. ప్రధాన న్యాయమూర్తి ఉండే అధికారిక నివాసాన్ని మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తక్షణం ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు హుకుం జారీ చేసింది. ఆ నివాసాన్ని ఖాళీ చేయడంతో […]
Congress leader Rahul Gandhi fires at Bihar Government: బిహార్ ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిహార్ రాజధాని పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై ఆయన మాట్లాడారు. నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గూండాల రాజ్యంగా మార్చిందని దుయ్యబట్టారు. నేడు బిహార్ దోపిడీ, కాల్పులు, హత్యల నీడలో నివసిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో నేరాలు జరగడం సాధారణంగా మారిపోయిందన్నారు. నేరాలను నిర్మూలించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్ర […]
Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 75కు పెరిగింది. ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం, వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. పలుచోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలకు తీవ్ర ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలు ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక్కరోజుల్లో 115-204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీమీటర్లు […]
Dalai Lama: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 1935 జులై 6న జన్మించిన దలైలామా నేడు 90వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రేమ, సహనానికి ఆయన చిహ్నం అని ప్రధాని పేర్కొన్నారు. “దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా 1.4 బిలియన్ల భారతీయులతో కలిసి నేను కూడా శుభాకాంక్షలు […]
Heavy Flood: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. దీంతో జలాశయం దాదాపు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన ఉన్న సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 1 లక్షా 71 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ కు వస్తోంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా ప్రాజెక్ట్ నుంచి 67,399 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం […]
Andhra and Telangana states Expected rains for coming 3 days: నైరుతి రుతుపవనాలు విస్తరించడంతోపాటు.. బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాగల మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఉత్తర గుజరాత్, ఉత్తర మధ్యప్రదేశ్, ఆగ్నేయ […]
Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రలో ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఐదు బస్సులు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ప్రమాదంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 36 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. శనివారం ఉదయం జమ్ముకాశ్మీర్ లోని రాంబన్ జి్లాల చందర్ కోట్ సమీపంలో ప్రమాదం జరిగింది. 6979 మంది యాత్రికులతో కూడిన నాలుగో బ్యాచ్ భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి దక్షిణ కాశ్మీర్ లోని పహల్గాం బేస్ క్యాంప్ నకు రెండు వేర్వేరు కాన్వాయ్ లలో […]