Home / జాతీయం
నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. జార్ఖండ్ హజారీబాగ్‌లోని ఒయాసిస్ పాఠశాలలో ప్రశ్నపత్రం షీల్డ్ ప్యాకెట్ దిగువ భాగంలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఈఓడబ్ల్యూ బృందం గుర్తించింది.ప్రశ్నపత్రం ప్యాకెట్లోని దిగువ భాగాన్ని చాలా జాగ్రత్తగా తారుమారు చేసి, అతికించినట్లు ఈఓయూ బృందం తన విచారణలో కనుగొంది.
18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సభ్యునిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపధ్యంలో మోదీ, మంత్రులు ఈ నెల జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మధ్య శనివారం నాడు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంతో పాటు రక్షణ ఉత్పత్తులు, కౌంటర్ టెర్రరిజానికి సంబంధించిన అంశాల్లో ఒకరి కొకరు సహాయం చేసుకోవడంతో పాటు సరిహద్దు అంశాల గురించి న్యూఢిల్లీలో వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి
విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్రప్రభుత్వం కొరడా ఝళిపించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సెనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటి) దీనికి సంబంధించి విధి విధానాలను విడుదల చేసింది.
ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత దాదాపు 48 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదు అవుతోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం నగరంలో ట్యాంకర్ల ముందు చాంతాడంత క్యూలైన్లు కనిపించాయి.
మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్... నీట్ పరీక్షలను రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం నీట్ పరీక్షలపై ఒక వైపు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. అయితే పరీక్షలు ఎందుకు రద్దు చేయడం లేదో విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ వివరించారు.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎండలు దంచి కొట్టాయి. ఇక మన దేశంలో ఈ వేసవిలో వడదెబ్బకు సుమారు 143 మంది ప్రాణాలు కోల్పోతే.. 41వేల మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గురువారం నేషనల్ సెంటర్ ఫర్ డీసీస్ కంట్రోల్ (ఎన్సీడీసీ) తాజా గణాంకాలను విడుదల చేసి ఈ వివరాలు వెల్లడించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి శుక్రవారం నాడు ఆయన బెయిల్‌పై విడుదల కావాల్సింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్‌పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని నిర్వాహకులను చీవాట్లు పెట్టింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా.. సహించేది లేదని హెచ్చరించింది.
బిహార్‌లో నితీష్‌కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో చుక్కెదురైంది. గత ఏడాది నవంబర్‌లో రిజర్వేషన్ చట్టాన్ని సవరించి మొత్తం రిజర్వేషన్ కోటాను 65 శాతానికి సవరించింది