Home / జాతీయం
దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ఈ ఏడాది ముంబై నిలిచింది. ఇక ఆసియాలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో నిలిస్తే.. ఢిల్లీ 30వ స్థానాన్ని ఆక్రమించింది. 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేను హెచ్ఆర్ కన్సెల్టెన్సీ సంస్థ మెర్సర్ నిర్వహించింది.
మన దేశంలోని హోటళ్లలో భోజనం చేస్తుంటే ఒక్కొసారి సాంబారులో బల్లులు, బొద్దింకలు తరచూ చూస్తుంటాం. అదే ప్రస్తుతం టాటా గ్రూపు నడుపుతున్న ఎయిర్ ఇండియా కూడా ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
కన్నడ చాలేంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్ లీలలు ఒక్కొక్కటి నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపిన దర్శన్ ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా..60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి కారణం గూడ్స్ రైలు కంచన్‌జుంగ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీ కొట్టడమని పోలీసులు వివరించారు.
కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ ధర లీటరుకు రూ.3 పెంచింది. సవరించిన రేట్లు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్‌పై అమ్మకం పన్ను 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం పెంచింది.
విసిగించే కాల్స్‌కు మోసపూరిత కాల్స్‌కు ఇక చెక్ పడనుంది. కేంద్రప్రభుత్వం ఒత్త్తిడితో పాటు టెలికం నియంత్రణా సంస్థ (ట్రాయ్) కూడా టెలికం ఆపరేటర్లపై ఒత్తిడి తేవడంతో విధి లేని పరిస్థితిలో దేశంలోని కొన్ని ఏరియాలో కాలర్ ఐడి సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉంది.
తాజాగా అరుంధతీయ రాయ్, మాజీ కశ్మీర్ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అత్యంత కఠిన చట్టం కింది కేసు నమోదు చేయమని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. . 23 మంది ప్రయాణికులతో బయలు దేరిన టెంపో ట్రావెలర్ లోయలో పడ్డంతో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్‌లోని భద్రీనాథ్ జాతీయ రహదారిలో రుద్రప్రయాగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
చత్తీస్‌గఢ్‌లో మారోమారు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం నాడు నారాయణపూర్ జిల్లాలో అభుజమార్హా లో భద్రతాదళాలకు.. నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. వాస్తవానికి అసలు గడువు జూన్ 30తో ముగియాల్సి ఉండగా ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించింది. మోసాలను తగ్గించేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ చర్య లక్ష్యం.