Home / ISRO
ISRO Successfully Docks SpaDeX Satellites in Space: ఇస్రో కొత్త ఏడాది ప్రారంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో పంపించిన రెండు ఉపగ్రహాలు విజయవంతమయ్యాయి. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్‌సెంటర్ నుంచి పంపిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 లో రెండు ఉపగ్రహాలను డిసెంబర్ 30వ తేదీన […]
V Narayanan as the new Chairman of the ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇస్రో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఆయన జనవరి 14న బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, నారాయణన్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్‌గా ఎస్.సోమనాథ్ ఉన్నారు. ఈయన పదవికాలం జనవరి 13తో ముగియనుంది. కాగా, ఆయన సారథ్యంలోనే చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. […]
ISRO Postponds SpaDex Docking to January 9: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం నేడు జరగాల్సిన డాకింగ్ ప్రక్రియను జనవరి 9కి మార్చుతున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. మిషన్‌లో సమస్యను గుర్తించటం వల్ల, డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని, ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ తేదీని మారుస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఇస్రో ప్రకటించింది. సమస్య కారణంగా […]
ISRO successfully launches PSLV-C59 rocket with European Space Agency’s Proba-3: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహకనౌక నిప్పులు చిమ్ముతూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఇస్రో విజయవంతగా ప్రయోగించింది. ప్రోబా-3 తీసుకుపోయిన రెండు ఉప గ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగలిగామని ఇస్రో […]
ఎట్టకేలకు దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ 'అగ్నిబాణ్'ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన అగ్నిబాణ్ ను షార్‌లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి గురువారం ఉదయం 7:15 గంటల సమయంలో రాకెట్‌ను సక్సెస్ ఫుల్‌గా ప్రయోగించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో మైలురాయిని దాటింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత కక్ష్యకి చేరుకుంది.
కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీనితో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది.
:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 పరీక్షను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. క్రూ మాడ్యుల్ ప్రయోగంలో భాగంగా సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ను నింగిలోకి పంపింది.
ఆదిత్య ఎల్ వన్ మిషన్ తొలి ఘనతని సాధించింది. ఇప్పటికే నిర్ణీత కక్ష్య దిశగా పయనిస్తున్న ఆదిత్య సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడికి సంబంధించిన ఫొటోలని తీసింది. లాగ్రెంజ్ వన్ పాయింట్ దిశగా వెళుతోంది.
చంద్రయాన్-3 విజయం అనంతరం సూర్యుడి దిశగా ఇస్రో ప్రయోగాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్ఎల్వీ-సి57 వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ తాజాగా ప్రయోగానికి వేదికైంది.