Published On:

GST Collections: జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు.. ఏకంగా 12 శాతం వృద్ధి

GST Collections: జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు.. ఏకంగా 12 శాతం వృద్ధి

Finance department: జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2026 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లోనే అంచనాలకు మించి పన్నులు వసూళ్లు జరిగాయి. గత ఏప్రిల్ నెలలో రూ. 2.37 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో పన్నుల రూపంలో వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా గతేడాది ఏప్రిల్ నెలలో రూ. 2.10 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఇది గతేడాది ఏప్రిల్ నెలకు 12.6 శాతం మేర పెరిగినట్టు సమాచారం. అలాగే జీఎస్టీ పన్నుల వసూళ్లను 2017 జూలై 1న ప్రారంభించగా ఇదే అత్యధికమని తెలిపింది. కాగా జీఎస్టీ ప్రారంభమైన తొలి నెలలో రూ.92 వేల కోట్ల వసూళ్లు వచ్చాయి. 2018 ఏప్రిల్ లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్కును దాటాయి. ఇక 2024 ఏప్రిల్ లో జీఎస్టీ వసూళ్లు రూ. 2 లక్షల కోట్లను దాటగా.. ఈ ఏడాది మరింత పెరగడం విశేషం.

కాగా పన్నులను తగ్గించి, నియమాలను సండలింపు చేయడం వల్లే జీఎస్టీ వసూళ్లు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కాగా రాబోయే రోజుల్లో ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పింది. కాగా 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 17 లక్షల కోట్లకు పైగా పన్నులు వసూలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా బడ్జెట్ లో ఈ ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ ఆదాయంలో 11 శాతం వృద్ధిని అంచనా వేసింది. కేంద్ర జీఎస్టీ, సెస్ సహా వసూళ్లు రూ. 11.78 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇందులో 86 శాతం సీజీఎస్టీ నుంచి, మిగిలిన 14 శాతం జీఎస్టీ సెస్ నుంచి రాబడి రానుందని కేంద్రం పేర్కొంది.