Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. ఆ వెర్షన్లను వాడితే ఇక అంతే
గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఒక వేళ ఈ హెచ్చరికను ఈజీగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఒక వేళ ఈ హెచ్చరికను ఈజీగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ బ్రౌజర్ ఉపయోగించే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేస్తున్నారని వెల్లడించింది.
పాత గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్న వారి సమాచారం ఆధారంగా బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారని తెలిపింది.
ఎప్పటికప్పుడు అప్ డేట్ (Google Chrome)
గూగుల్ క్రోమ్ సాదారణంగా మనలో చాలామంది ఉపయోగించే బ్రౌజర్. ఇంటర్ నెట్ ను యూజ్ చేసేటప్పుడు మనకు సంబంధించిన పర్సనల్ సమాచారాన్ని ఇస్తుంటాం.
ఒక వేళ బ్రౌజర్ సురక్షితమైతే మనం ఇచ్చిన సమచారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కానీ బ్రౌజర్ ఏమాత్రం సేఫ్ కాకపోతే మాత్రం మన సమాచారం అంతా హ్యాకర్స్ చేతిలో ఉంటుంది.
అయితే ఇలాంటి హ్యాకింగ్ సమస్యలను అరికట్టేందుకు గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ వెర్షన్ అందిస్తుంటుంది.
కానీ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోకుండా అలాగే పాత వెర్షన్ వాడుతుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్టే అని ప్రభుత్వం సూచిస్తోంది.
ఆ యూజర్లకు వార్నింగ్
విండోస్ ఉపయోగించే యూజర్లు 110.0.5481.77/.78 వెర్షన్, లైనెక్స్, మ్యాక్స్ యూజర్లు 110.0.5481.77 వెర్షన్ కంటే పాతవి ఉపయోగిస్తున్న వారికి ఈ హెచ్చరికలు జారీ చేసింది భారత ప్రభుత్వం.
తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఓ రిపోర్టును రిలీజ్ చేసింది.
గూగుల్ క్రోమ్ లో యూజర్ల సమాచారం ఎలా హ్యాక్ అవుతుందో ఈ నివేదిక లో వివరించింది.
కాబట్టి హ్యాకర్ల బారిన పడకూడదంటే గూగుల్ క్రోమ్ కొత్త వెర్షన్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
ఈ విషయంలో క్రోమ్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని , లేకపోతే వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.