Shoaib Malik-Sana Javed: షోయబ్ మాలిక్ -సనా జావేద్ ల మధ్య మూడేళ్లనుంచి ఎఫైర్ నడుస్తోందా?
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాక వారద్దిరిపై సోషల్ మీడియాలో పాక్ ప్రజలు విరుచుకు పడుతున్నారు. వారిద్దరు తమ జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకోవడాన్ని వారు తప్పు బడుతున్నారు. ఈ నేపధ్యంలో సానియా మీర్జాకు పాకిస్తాన్‌లోని ప్రజల నుండి బలమైన మద్దతు లభించడం విశేషం.

Shoaib Malik-Sana Javed: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాక వారద్దిరిపై సోషల్ మీడియాలో పాక్ ప్రజలు విరుచుకు పడుతున్నారు. వారిద్దరు తమ జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకోవడాన్ని వారు తప్పు బడుతున్నారు. ఈ నేపధ్యంలో సానియా మీర్జాకు పాకిస్తాన్‌లోని ప్రజల నుండి బలమైన మద్దతు లభించడం విశేషం.
సనాను కూడా పిలవాలంటూ..(Shoaib Malik-Sana Javed)
ఇలా ఉండగా షోయబ్ మాలిక్, సనాల మధ్య గత మూడేళ్లనుంచి ఎఫైర్ నడుస్తోందని పాక్ న్యూస్ చానెల్ సమా టీవీ పేర్కొంది. సనా తన మాజీ భర్త ఉమైర్ జస్వాల్ నుండి వివాహమయిన మూడు నెలలకే విడాకులు తీసుకున్నారని దీనికి కారణం షోయబ్ తో అఫైరని చెప్పింది. మాలిక్ ఛానెల్‌లోని ఏదైనా షోలకు ఆహ్వానించబడినప్పుడు, అతను సనాను కూడా పిలవాలనే షరతు విధిస్తాడని చెప్పింది.వారు గత మూడు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్నారు.సానియా మీర్జా, ఆమె కుటుంబం, మాలిక్ కుటుంబానికి కూడా ఈ విషయం గత సంవత్సరం తెలిసింది. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే మాలిక్ ఎవరి మాట వినలేదని చానెల్ ప్రతినిధులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- China Woman Fortune: పెంపుడు జంతువులకు రూ.23 కోట్ల ఆస్తిని రాసిన చైనా మహిళ
- Woman Wants Divorce: భర్త హనీమూన్ కోసం గోవాకు బదులు అయోధ్యకు తీసుకెళ్లాడని విడాకులు కోరుతున్న మహిళ