Karnataka Ministers: కర్ఱాటకలో మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం సిద్దరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌కు నీటిపారుదల మరియు బెంగళూరు నగరాభివృద్ధి శాఖలను కేటాయించగా ఆర్థిక శాఖను తన వద్ద ఉంచుకున్నారు

Karnataka Ministers: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం డికె శివకుమార్‌కు నీటిపారుదల మరియు బెంగళూరు నగరాభివృద్ధి శాఖలను కేటాయించగా ఆర్థిక శాఖను తన వద్ద ఉంచుకున్నారు.సిద్ధరామయ్య మే 20న శివకుమార్ మరియు ఎనిమిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో పలు ధఫాల చర్చల తర్వాత శనివారం 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా ఆయన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయికి విస్తరించారు.
డీకే కు ఇరిగేషన్, బెంగళూరు డెవలప్ మెంట్..(Karnataka Ministers)
గతంలో హోం శాఖను నిర్వహించిన జి. పరమేశ్వరకు మరోసారి అదేశాఖను అప్పగించారు. ఎంబీ పాటిల్‌కు భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, కేజే గెరోజ్‌కు ఇంధన శాఖను కేటాయించినట్లు కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఆర్థిక శాఖతో పాటు, కేబినెట్ వ్యవహారాలు, సిబ్బంది మరియు పరిపాలనా సంస్కరణల శాఖ, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఇతరులకు కేటాయించని పోర్ట్‌ఫోలియోలను సీఎం సిద్దరామయ్య తన వద్ద ఉంచుకున్నారు.బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP), బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ, బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు, బెంగళూరు మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మరియు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో సహా అన్ని ముఖ్యమైన మేజర్ మరియు మీడియం ఇరిగేషన్ మరియు బెంగళూరు నగర అభివృద్ధిని డీకే శివకుమార్ పొందారు.
హెచ్ కె పాటిల్‌కు చట్టం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు, శాసనాలు మరియు పర్యాటక శాఖలను కేటాయించగా, కెహెచ్ మునియప్ప కు ఆహార మరియు పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ, రామలింగారెడ్డికి రవాణా శాఖ దినేష్ గుండూరావు కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్‌సీ మహదేవప్పకు సాంఘిక సంక్షేమ శాఖ అప్పగించారు. పబ్లిక్ వర్క్స్ సతీష్ జారకిహోళికి, రెవెన్యూని కృష్ణ బైరేగౌడకు కేటాయించారు.
ఇవి కూడా చదవండి:
- ISRO GSLV-F12 : ఇస్రో మరో విజయం.. GSLV-F12 రాకెట్ ప్రయోగం సక్సెస్
- Malaysia Masters Tourney : మలేసియా మాస్టర్ట్స్ సింగిల్స్‌లో టైటిల్ కైవసం చేసుకొని రికార్డు సృష్టించిన హెచ్ఎస్ ప్రణయ్..