Last Updated:

Parliament: పార్లమెంట్‌లో తోపులాట.. బీజేపీ ఎంపీకి గాయాలు.. రాహుల్ బెదిరించాడా?

Parliament: పార్లమెంట్‌లో తోపులాట.. బీజేపీ ఎంపీకి గాయాలు.. రాహుల్ బెదిరించాడా?

BJP MP alleges Rahul Gandhi pushed him in Scuffle outside Parliament: పార్లమెంట్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. హోం మంత్రి అమిత్ షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు నిరసన చేస్తున్నారు.

అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారంటూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీల నిరసనలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంట్ భవనం ఎక్కి విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. ఈ సమయంలో ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయనను హుటాహుటిన స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే, రాహుల్ గాంధీ తనను తోసేశారని బీజేపీ ఎంపీ సారంగి ఆరోపించారు. నేను ఆ సమయంలో అక్కడ మెట్ల వద్ద నిల్చుండగా.. ఓ ఎంపీని నెట్టేయడంతో అతన వచ్చి నాపై పడటంతో నేను కూడా కిందపడినట్లు చెప్పాడు. అలాగే పార్లమెంట్‌లోకి వెళ్తున్న ఎంపీలను ప్రతిపక్ష సభ్యులను అడ్డుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కావాలని తోశారని, ఈ ఘర్షణలో ఒడిశా ఎంపీకి గాయాలైనట్లు అక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, తోపులాట ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా.. బీజీపీ ఎంపీలు నన్ను వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. నాతో పాటు మల్లికార్జున్ ఖర్గేను కూడా తోసేసి బెదిరించారన్నారు. ఈ వివాదంతో పార్లమెంట్ ఆవరనలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో లోక్ సభ సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.