Home / తప్పక చదవాలి
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.ఇంటర్ ఫస్టియర్ లో ఉత్తీర్ణత శాతం 60.01 కాగా 12వ తరగతిలో 64.19 గాఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని సూచించింది
బీఆర్ఎస్, కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిపాజిట్ కూడా రాదన్నారు.మెదక్‌లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవదన్నారు.
ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు.మే 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీరిద్దిరిని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా తన ముందు హాజరుపరచాలని రౌస్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీహార్ జైలు అధికారులను ఆదేశించారు.
రేవంత్ రెడ్డి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ చదివారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మెదక్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధుల నివేదికను రేవంత్ రెడ్డికి కొరియర్ పంపించానని తెలిపారు. మెదక్ నివేదికే హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి సమాధానం చెబుతోందని చెప్పారు. మతకల్లోలాలు చేయడం బీజేపీ సిద్దాంతం కాదని.. కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుకున్నది, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, సోకాల్డ్ వాదులని విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు మొదటి సర్వీసును 2026లో నడిపే అవకాశం ఉందని కేంద్ర రైల్వే మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఒక వార్తాసంస్దకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్టాడుతూ అహ్మదాబాద్-ముంబై మార్గంలో బుల్లెట్ రైళ్ల పనులు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పారు.
తైవాన్ తూర్పు తీరంలో 24 గంటల వ్యవధిలో 6.3 తీవ్రతతో 80 భూకంపాలు సంభవించాయి. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు సంభవించిన ఈ భూకంపాల ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. బెంగళూరు కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికుడిని అడ్డగించి అరెస్టు చేసామని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‌లో చెప్పారు. విచారణ జరుగుతోంది. వన్యప్రాణుల అక్రమరవాణాను సహించబోమని తెలిపారు.
మలేసియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.