Home / తప్పక చదవాలి
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాయో చూసేద్దాం.
ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐఓ) నిర్వహించే అందాల పోటీలకు గత ఆరు దశాబ్దాలుగా ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. భారత్ లో ఈ అందాల పోటీలు ఫెమీనా పేరుమీదే ఫెమీనా మిస్ ఇండియా పోటీలుగా పేరుగాంచాయి. ఈ నేపథ్యంలోనే 2023 మిస్ ఇండియా పోటీలకు ప్రకటన వెలువడింది.
దేశంలో మరికొన్ని సినిమా థియేటర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పలు గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లని నిర్మించేందుకు ప్రభుత్వ రంగ సీఎస్సీ ఈ- గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయించింది. అక్టోబర్ సినిమాతో కలిసి 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో మరో 10,000 సినిమా హాళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి.
డిసెంబర్ 18న ఖతార్లో జరిగే ఫిఫా ఫైనల్ మ్యాచ్కు ముందు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారని సమాచారం.
నేటి కాలంలో పలు రకాల టీలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో ఒకటి గ్రీన్ టీ. అయితే ఈ గ్రీన్ టీతో ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు ఉన్నాయని అనేక మంది ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అదే గ్రీన్ టీ కొందరిలో కాలేయ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఏదైనా మనకు తెలియని పదం కనిపించినా వినిపించినా వెంటనే డిక్షనరీలో వెతుకుతాం. మరి అలాంటి డిక్షనరీల్లో ఒకటైన ప్రముఖ ఇంగ్లిష్ నింఘంటువు ‘ఆక్స్ ఫర్డ్’ ప్రతి ఏడాది ఒక కొత్తపదాన్ని చేర్చుతూ ఉంటుంది. దానిలో భాగంగా 2022 సంవత్సరానికి గానూ ‘గోబ్లిన్ మోడ్’ అనే వర్డ్ ని చేర్చుతున్నట్టు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా మత్తుపదార్దాల స్మగ్లింగ్ ఏపీలోనే ఎక్కువగా జరుగుతోంది. 2021-22లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డిఆర్ఐ) సోమవారం విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది.
తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ ఫిరాయింపులపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన వైకాపా గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ‘తిమింగలం’వాలింది. ఒకరోజంతా అక్కడే సేదతీరి.. తిరిగి సోమవారం రాత్రి ఎగిరిపోయింది. సముద్రంలో ఉండాల్సిన తిమింగలం ఎయిర్పోర్టులో ఉండడమేంటా అనే కదా మీ సందేహం నిజమేనండి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమాన తిమింగలం.