Last Updated:

Drugs : మత్తుపదార్దాల స్మగ్లింగ్ లో ఏపీనే టాప్

దేశవ్యాప్తంగా మత్తుపదార్దాల స్మగ్లింగ్ ఏపీలోనే ఎక్కువగా జరుగుతోంది. 2021-22లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డిఆర్ఐ) సోమవారం విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది.

Drugs : మత్తుపదార్దాల స్మగ్లింగ్ లో ఏపీనే టాప్

Andhra Pradesh: దేశవ్యాప్తంగా మత్తుపదార్దాల స్మగ్లింగ్ ఏపీలోనే ఎక్కువగా జరుగుతోంది. 2021-22లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డిఆర్ఐ) సోమవారం విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది. దీని ప్రకారం సీఆర్పీఎఫ్ 2021-22లో దేశంలో ఎక్కువగా మత్తు పదార్థాలను ఆంధ్రప్రదేశ్‌లోనే స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా18 వేల 267.84 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని 90 మందిని అరెస్ట్ చేసారు. ఏపీ తర్వాతి స్థానాల్లో 10 వేల 104 కిలోలతో త్రిపుర, 3 వేల 366 కిలోలతో అసోం, ఒక వేయి 12 కిలోలతో తెలంగాణ, 830 కిలోలతో ఛత్తీస్ గఢ్ ఉన్నాయి.

ఏపీలో 2021-22 సంవత్సరంలో వెయ్యి 57 కిలలో గంజాయిని డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. మధ్య ప్రదేశ్ లో 5 వేల 846 కిలోలు, త్రిపురలో 4 వేల 264 కిలోలు, ఉత్తర్ ప్రదేశ్ లో 3 వేల 141 కిలోలు, అసోంలో 2 వేల 800 కిలోలు, మహారాష్ట్ర 2 వేల 639 కిలోలు, మేఘాలయలో వెయ్యి 356 కిలోలు, బిహార్ లో వెయ్యి 297 కిలోలు తర్వాత ఎక్కువగా పట్టుబడింది ఏపీలోనే. 2021-22 సంవత్సరంలో దేశం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.97 కోట్ల విలువైన 161.83 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ నివేదిక తెలిపింది.

2021-22లో, కొకైన్ స్వాధీనం 8.667 కిలోల నుండి 310.21 కిలోలకు పెరిగింది. అయితే మెథాంఫేటమిన్ మరియు హెరాయిన్, 884.69 కిలోలు మరియు 3,410 కి పెరిగాయి.అదేవిధంగా కస్టమ్స్ శాఖ రూ.17,394 కోట్ల విలువైన డ్రగ్స్‌ను, డీఆర్‌ఐ రూ.20,064 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.1,324 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి: