Home / తప్పక చదవాలి
తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. సోమ, మంగళవారాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలనేపధ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
ఐదు వంటనూనెల రిటైల్ ధరలు మస్టర్డ్ ఆయిల్, వనస్పతి, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మరియు పామాయిల్ గత నెలతో పోలిస్తే 2–8% తగ్గాయి, అయితే ఇప్పటికీ గత ఏడాదికంటే 3–21% ఎక్కువగా ఉన్నాయి.
భారతదేశంలోని వివిధ ప్రదేశాలల్లో సుందరమైన అందాలను అనుభవించడానికి వర్షాకాలం ఉత్తమ సమయాలలో ఒకటి. ప్రకృతిఅందాలకు నెలవైన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అయితే వీటిలో వర్షాకాలంలో చూడటానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఐదు వున్నాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్‌లో మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ తో ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. తన కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను విడుదల చేశారు.
వర్షాకాలం వస్తేనే చాలు. అందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.ఈ కాలంలో జలుబు, దగ్గు, విరేచనాలతో ఎక్కువమంది ఇబ్బందిపడుతుంటారు. వీటికి కారణం పరిశుభ్రమయిన ఆహారాన్ని తీసుకోకపోవడం.
అమర్నాథ్ యాత్రికులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. చుట్టూ ఉన్న కొండల్లోంచి ఆకస్మికంగా పోటెత్తిన వరద అమరనాథుడి గుహ ఎదుటే వాగులో సేదదీరుతున్న భక్తులపై అమాంతం వచ్చిపడింది.
ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాలో ముసురు వాతావరణం నెలకొంది. ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల నిర్వహణకు ఉన్న గ్యాప్‌ను కేంద్రం బుధవారం 9 నెలలు లేదా 39 వారాల నుంచి 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18-59 సంవత్సరాల మధ్య ఉన్న లబ్దిదారులందరికీ 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత బూస్టర్‌ను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాల పై నవ సందేహాలు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మొదటి రత్నం: రైతు భరోసా 64 లక్షల మందికి మేలు అని చెప్పి, 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా