Last Updated:

Goblin Mode: “గోబ్లిన్ మోడ్”.. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ “వర్డ్ ఆఫ్ ద ఇయర్”

ఏదైనా మనకు తెలియని పదం కనిపించినా వినిపించినా వెంటనే డిక్షనరీలో వెతుకుతాం. మరి  అలాంటి డిక్షనరీల్లో ఒకటైన ప్రముఖ ఇంగ్లిష్ నింఘంటువు ‘ఆక్స్ ఫర్డ్’ ప్రతి ఏడాది ఒక కొత్తపదాన్ని చేర్చుతూ ఉంటుంది. దానిలో భాగంగా 2022 సంవత్సరానికి గానూ ‘గోబ్లిన్ మోడ్’ అనే వర్డ్ ని చేర్చుతున్నట్టు ప్రకటించింది.

Goblin Mode: “గోబ్లిన్ మోడ్”.. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ “వర్డ్ ఆఫ్ ద ఇయర్”

Goblin Mode: ఏదైనా మనకు తెలియని పదం కనిపించినా వినిపించినా వెంటనే డిక్షనరీలో వెతుకుతాం. మరి  అలాంటి డిక్షనరీల్లో ఒకటైన ప్రముఖ ఇంగ్లిష్ నింఘంటువు ‘ఆక్స్ ఫర్డ్’ ప్రతి ఏడాది ఒక కొత్తపదాన్ని చేర్చుతూ ఉంటుంది. దానిలో భాగంగా 2022 సంవత్సరానికి గానూ ‘గోబ్లిన్ మోడ్’ అనే వర్డ్ ని చేర్చుతున్నట్టు ప్రకటించింది.

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కొద్దిరోజుల క్రితం వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక కోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. గడిచిన రెండు వారాల్లో ఈ పోల్ లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోబ్లిన్ మోడ్ అంటే ఒక రకమైన ప్రవర్తనను చెప్పేందుకు ఉపయోగించే పదం. అనాలోచితం, స్వీయ భావన, బద్ధకం, నిదానంగా, అత్యాశతో అనే అర్థాల కింద గోబ్లిన్ మోడ్ ను వాడుతుంటారు. ఈ పదం తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చింది. నిఘంటు శాస్త్రవేత్తలు మెటావర్స్, స్టాండ్ విత్, గోబ్లిన్ మోడ్ అనే మూడు పదాలను తుదిగా ఎంపిక చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను కోరారు. కాగా వీటిలో గోబ్లిన్ మోడ్ పదానికి 3,00,000 మంది ఓటు వేసినట్టు ఆక్స్ ఫర్డ్ ప్రకటించింది.

ఇదీ చదవండి: ఇప్పుడు పెప్సీ వంతు.. భారీగా లేఆఫ్స్ ప్రకటన

ఇవి కూడా చదవండి: