Home / తప్పక చదవాలి
Mandous Effect : మాండూస్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ఈరోజు అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో
Mandous Cyclone : మాండూస్ తుఫాను దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు దూసుకోస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం ముందుస్తు చర్యలు చెప్పటింది. ఇవాళ అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద తుఫాను తీరం దాటే అవకాశం
Mandous : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను మరింత ప్రస్తుతం మరింత బలపడినట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు తీవ్ర తుఫానును మారి... దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల వైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు దాదాపు 6 కి.మీ వేగంతో కదులుతోందని అధికారులు
జనసేన ప్రచార రథం వారాహి వాహనం కలర్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కనీసం నేను ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాకు రీమేక్ సినిమాలు వద్దు స్ట్రెయిట్ సినిమాలే కావాలంటూ పవన్ అభిమానులు #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. పవన్ హరీష్ శంకర్‌తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటన రావడంతో పవన్ అభిమానులంతా ఎంతగానో సంతోషించారు. అయితే ఈ ప్రకటన వచ్చి ఏడాది అయినప్పటికీ ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోడవంతో ఫ్యాన్స్ నిరాసచెందుతున్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలింగ్ తోనే కాకుండా బ్యాట్ తోనూ అద్భుతాలు చెయ్యగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ గా జడేజాకు క్రికెట్ చరిత్రలో మంచి పేరుంది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా గతేడాది సీఎస్కేకు సారథ్యం కూడా వహించాడు. జడేజా బరిలోకి దిగి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఈ సారి ఈయన భార్య కూడా బరిలో ఉన్నారు. అది క్రికెట్ మైదానంలో కాదండోయ్ గుజరాత్ ఎన్నికల్లో. ఇంతకీ జడేజా భార్య ఎవరు.. ఆమె ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకుందాం.
AAP : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది.
వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కోసం తాజాగా మెగాస్టార్ చిరంజీవి విదేశాలకు బయలుదేరాడు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, కూతురు సుష్మిత పిల్లలు కూడా వెళ్లారు. అయితే తన ఫారిన్ ట్రిప్ విషయాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ మెగాస్టార్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర..’ అంటూ ఫొటోకు క్యాప్షన్ కూడా జోడించారు మెగాస్టార్.
విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.
హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు దశాబ్దాల నాటి ఆనవాయితీ కొనసాగింది. అధికారంలో ఉన్నపార్టీని గద్దె దింపి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.