Home / తప్పక చదవాలి
ఇటీవల కాలంలో తరచుగా విమానాలలో మూత్రవిసర్జన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ట్రైన్ లో టీటీఈ మద్యం మత్తులో మహిళా ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమృత్సర్-కోల్‌కతా అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన జరిగింది.
పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం అధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు క్యాబినెట్ సభ్యులతో సహా ఎన్నికైన అధికారులకు 300 డాలర్ల కంటే ఎక్కువ విలువైన తోషాఖానా బహుమతులను తీసుకోవడాన్ని నిషేధించింది. ఇది న్యాయమూర్తులు, సివిల్ మరియు మిలటరీ అధికారులకు కూడా వర్తిస్తుంది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఆగడాలకు అంతే లేకుండాపోతోంది. రష్యా సైనికులు పెద్దెత్తున యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలుఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపధ్యంలో ప్రపంచ ఆహార ధరలను తగ్గించడంలో సహాయపడిన ధాన్యం ఎగుమతి ఒప్పందానికి పొడిగింపును అంగీకరించడానికి మాస్కో సిద్ధంగా ఉందని రష్యా ప్రతినిధి బృందం సోమవారం తెలిపింది. కానీ ఇది కేవలం 60 రోజులకు మాత్రమే అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలకు వీరిని కూర్చోబెట్టి పెన్షన్లు ఇవ్వడం తలకు మించిన భారంగా భావిస్తోంది. ఫ్రాన్స్‌లో మెక్రాన్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 62 నుంచి 64కు పెంచింది.
ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన తొలి మహిళగా నిలిచారు.సోమవారం ముంబైలోని షోలాపూర్ స్టేషన్ మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య సెమీ-హై స్పీడ్ రైలును ఆమె నడిపారు
గుజరాత్లో 58 ఏళ్ల మహిళ H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ బారిన పడి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆమె వడోదరలోని ఎస్ఎస్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.దీనితో భారత్‌లో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది
మూడు సంవత్సరాల తరువాత విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతిస్తామని చైనా మంగళవారం ప్రకటించింది. మార్చి 15 నుండి వివిధ రకాల వీసాల జారీని పునఃప్రారంభిస్తామని తెలిపింది. కోవిడ్ నేపధ్యంలో గత మూడేళ్లుగా విదేశీ పర్యాటకులను చైనా అనుమతించలేదు.
పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 17 లక్షల మందికి పైగా మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నేటి (మార్చి 14) నుండి తమ నిరవధిక సమ్మెను ప్రారంభించారు. నివేదికల ప్రకారం, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే వరకు సమ్మె కొనసాగుతుందని మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చెప్పింది
1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ (యుసిసి) నుండి అదనపు పరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్రం చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది.