Home / తప్పక చదవాలి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జ్ షీట్లో మొదటిసారిగా నమోదయింది. ప్రియాంక హర్యానాలో ఐదెకరాల భూమిని కొనడం, అమ్మడం ఘటనకు సంబంధించి ఆమె పేరును ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా పేరును చార్జి షీటులో చేర్చారు. అయితే ఇద్దరూ ఇంకా అధికారికంగా నిందితులుగా పేర్కొనబడలేదు.
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించింది.సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు వర్గాలు ధృవీకరించాయి.
ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల విరోధి అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. వైసిపి సర్కార్ కాపు వ్యతిరేక విధానం చూస్తుంటే కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని అర్థమైపోతోందని జోగయ్య చెప్పారు.
అర్హులైన దరఖాస్తుదారులందరికీ ప్రభుత్వ పధకాలు అందుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్‌లతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ఇంచార్జ్‌ల అభిప్రాయాలని తెలుసుకున్నారు.
కోలీవుడ్ లో విజయవంతమైన నటుడిగా నిరూపించుకున్న విజయకాంత్ సెప్టెంబర్ 2005లో డీఎండీకేని స్థాపించడం ద్వారా తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు. తమిళనాట అప్పటికే సంస్దాగతంగా బలంగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) లకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నించారు.
డీఎండీఏ పార్టీ అధినేత, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ కొంతకాలం క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనని కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్‌కి చెందిన ఇంటిని ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలివి.
కాంగోలోని కసాయి-సెంట్రల్ ప్రావిన్స్‌లో వరదలతో 22 మంది మరణించారు, అక్కడ కుండపోత వర్షాలు మౌలిక సదుపాయాలను నాశనం చేసి వరదలకు కారణమయ్యాయని కనంగా పట్టణ అధికారులు తెలిపారు.కొండచరియలు విరిగిపడటంతో ఇళ్ళు, చర్చిలు మరియు రోడ్లు ధ్వసం అయి పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 240 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్ ) సెంట్రల్ గాజాలో త మంగళవారం 100 ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిపింది.