Last Updated:

Vijayakanth: గుడ్ బై కెప్టెన్.. ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూత

డీఎండీఏ పార్టీ అధినేత, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ కొంతకాలం క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనని కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు.

Vijayakanth: గుడ్ బై కెప్టెన్.. ప్రముఖ  నటుడు విజయకాంత్ కన్నుమూత

Vijayakanth: డీఎండీఏ పార్టీ అధినేత, ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ కొంతకాలం క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనని కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. విజయకాంత్ మృతితో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

విజయకాంత్‌ 1952 ఆగస్టు 25న మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని చిన్న కుమారుడు షణ్ముగ పాండియన్ కూడా నటుడే27 ఏళ్ల వయసులో విజయకాంత్‌ సినీరంగంలో తెరంగేట్రం చేసి ఇప్పటివరకు 154 సినిమాల్లో నటించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపును సొంతం చేసుకున్నారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు.

‘కెప్టెన్’ పేరెలా వచ్చిందంటే..(Vijayakanth)

విజయకాంత్ 1979లో ఇనిక్కుం ఇళమై సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అతను 1980లో దూరతు ఇడి ముజక్కం మరియు 1981లో సత్తమ్ ఒరు ఇరుత్తరై చిత్రాలతో విజయం సాధించే వరకు వరుస ఫ్లాప్‌లను చవిచూశారు.1986లో అమ్మన్ కోవిల్ కిజకలే అనే చిత్రానికి తమిళంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ను గెలుచుకున్నారు.అతని 100వ చిత్రం, కెప్టెన్ ప్రభాకరన్ ఘనవిజయంతో అభిమానులు ‘కెప్టెన్’ అనే పిలవడం ప్రారంభించారు. 1992లో వచ్చిన చిన్న గౌండర్ చిత్రంలో గ్రామపెద్దగా నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రం విజయకాంత్‌కు గ్రామీణ ప్రజలలో ఖ్యాతిని తెచ్చిపెట్టింది.విజయకాంత్ 2001లో తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి అవార్డును గెలుచుకున్నారు.2002లో అవినీతికి వ్యతిరేకంగా రూపొందించిన చిత్రం రమణ చిత్రానికి తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.