Home / తప్పక చదవాలి
కాళేశ్వరం ప్రాజెక్ట్ను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు సందర్శించారు. హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు వెళ్లారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించారు.
ఇన్స్టాగ్రామ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య కోటి దాటింది. క్రిమినల్ కోడ్లు మరియు చట్టాలను సరిదిద్దే మూడు చట్టాలతో సహా కొన్ని మైలురాయి బిల్లులను పార్లమెంటులో ఆమోదించిన తరువాత వారి సంఖ్య బాగా పెరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు లలన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. జేడీయూ కొత్త చీఫ్గా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నియమితులయ్యారు.శుక్రవారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడవలి రామకృష్ణ, భార్యతో పాటు, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి మృతి చెందగా.. కుసుమ అనే మరో తొమ్మిదేళ్ల చిన్నారి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బంధువులు చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజుసమీక్షలు నిర్వహించనున్నారు. కాకినాడ నగరంలో డివిజన్ల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం అవుతున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఓడించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్ట్ బ్రేక్ వేసింది. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జనవరి 11 వరకు సినిమా రిలీజ్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ను క్యాన్సల్ చేస్తూ తీర్పునిచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్సిపిలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ క్రికెటర్ రాయుడికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి రాయుడు గత కొద్దకాలంగా ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పధకాలకు తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
టెస్లా యొక్క గిగా టెక్సాస్ కర్మాగారంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఒక రోబో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీర్ కొత్తగా వేసిన అల్యూమినియం ముక్కల నుండి కారు భాగాలను కత్తిరించే పనిలో ఉన్న రోబోలను పర్యవేక్షించడానికి సాఫ్ట్వేర్ను కోడింగ్ చేస్తున్నాడు.
ఉత్తర మధ్య లైబీరియాలో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో కనీసం 40 మంది మరణించారని ఆ దేశ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ కాటే బుధవారం తెలిపారు.మంగళవారం రాజధాని మన్రోవియా నుండి 130 కి.మీ (80 మైళ్ళు ) దూరంలోని దిగువ బాంగ్ కంట్రీలోని టోటోటాలో ఇంధన ట్రక్కు కూలిపోయి పేలుడు సంభవించింది. దీనితో సంఘటనా స్థలానికి తరలివచ్చిన పలువురు మరణించగా మరికొంతమంది గాయపడ్డారు.
గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ నౌకాదళ అధికారుల కు ఖతర్ లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఖతర్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మరణశిక్షను రద్దు చేస్తూ వారికి ఊరట కల్పించింది. వారికి శిక్షను తగ్గించి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది.