Last Updated:

Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన మంత్రుల బృందం.. బీఆర్ఎస్ సర్కార్ పై ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు సందర్శించారు. హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు వెళ్లారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించారు.

Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన మంత్రుల బృందం.. బీఆర్ఎస్ సర్కార్ పై ఫైర్

Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు సందర్శించారు. హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు వెళ్లారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.

కాళేశ్వరం ఓ తుగ్లక్ ప్రాజెక్టు..(Kaleswaram Project)

కాళేశ్వరం ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఇరిగేషన్ అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ తుగ్లక్ ప్రాజెక్టని కోమటిరెడ్డి అన్నారు. గ్రావిటీతో పూర్తయ్యే ప్రాజెక్టుకి బదులోగా నదిలో 3 ప్రాజెక్టులు కట్టడం ఓ తుగ్లక్ చర్యని కోమటిరెడ్డి విమర్శించారు. కెసిఆర్ బంధువుకోసమే టెండర్లు లేకుండా పనులు కట్టబెట్టారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు సాధ్యం కాదని అధికారులు చెప్పాలని, లేదంటే సెలవు పెట్టి వెళ్ళాల్సిందని కోమటిరెడ్డి ఫైరయ్యారు.

 ప్రాణహిత చేవెళ్లే ఉత్తమం..

కాళేశ్వరం కంటే ప్రాణహిత చేవెళ్లే ఉత్తమం మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి అన్నారు. 80వేల కోట్ల నుంచి ప్రాజెక్టు వ్యయం లక్షన్నర కోట్లకు చేరిందని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని… ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్ట్ డ్యామేజ్ కావడం బాధాకరమని ఉత్తమ్ అన్నారు. సీఎం రేవంత్ విచారణ చేయిస్తామని చెప్పారని.. మేడిగడ్డ బ్యారేజీలో వాస్తవాలను పరిశీలించి సీఎంకు నివేదిక ఇస్తామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయని.. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తమకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషాలు లేవని.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై సమీక్ష చేస్తామని చెప్పారు. రాష్ట్ర సంపదను సరిగా ఖర్చు చేశారో లేదో సమీక్షిస్తామని.. మంథని నియోజకవర్గంలో అందరికీ సాగునీరు అందిస్తామన్నారు. నీరు నిల్వతో గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు.