Home / తప్పక చదవాలి
తెలంగాణలో ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆబ్కారీ శాఖ పంట పండింది. ఒక్కరోజే మద్యం ప్రియులు దుమ్ము లేపారు. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 313 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
సోమవారం జపాన్‌లో వరుసగా బలమైన భూకంపాలు సంభవించాయి. దీనితో జపాన్ వాతావరణ సంస్ద సునామీ హెచ్చరికను జారీ చేసింది. ప్రజలను త్వరగా తీరప్రాంతాలను విడిచిపెట్టమని కోరింది.జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, భూకంపం ఇషికావా మరియు సమీపంలోని ప్రిఫెక్చర్లను తాకింది,
ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్న హౌతీ తిరుగుబాటు దారులపై అమెరికా నేవీ హోలికాఫ్టర్లు కాల్పులు జరపడడంతో 10 మంది మరణించారు. అంతేకాదు ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహిస్తున్న మూడు బోట్లను యుఎస్ హెలికాప్టర్లు ముంచేసాయి.
విశాఖపట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పదిమంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్టణంలో నివసిస్తున్న ఒడిశాకి చెందిన 17 ఏళ్ళ బాలికని భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు.
కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీనితో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గబ్బర్ సింగ్ ఫేమ్ శృతి హాసన్ నటించిన యాక్షన్ డ్రామా సలార్ మొదటిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం దేశ విదేశాల్లో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధనకోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.
బీహార్‌లోని మోతీహరి వీధుల్లో ఒక విమానం వంతెన కింద ఇరుక్కుపోయి ట్రాఫిక్‌కు పెద్ద అంతరాయం కలిగించింది.పాత విమానాన్ని ముంబై నుంచి అసోంకు ట్రైలర్ ట్రక్కుపై తరలిస్తుండగా, పిప్రకోఠి ప్రాంతంలోని ఓవర్‌బ్రిడ్జి కింద చిక్కుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
అమెరికాలోని మసాచుసెట్స్ స్టేట్‌లోని వారి ఇంట్లో భారతీయ సంతతికి చెందిన సంపన్న దంపతులు ,వారి కుమార్తె చనిపోయినట్లు మీడియా తెలిపింది. భర్త మృతదేహం దగ్గర తుపాకీ దొరికినందున గృహ హింస కారణంగా ఈ సంఘటన సంభవించే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
నూతన సంవత్సరం సంబరాలకు దూరంగా ఉండాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిక ప్రధాన కారణం గాజా పై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు పాకిస్థాన్ మరోసారి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే గాజా ప్రజలకు సంఘీభావంగా ఈసారి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.