Last Updated:

MLA Jonnalagadda Padmavathi: ఎస్సీ ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా? వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్

శింగనమల ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే.. ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆమె మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ అసహనం వ్యక్తం చేశారు.

MLA Jonnalagadda Padmavathi: ఎస్సీ ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా?  వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్

MLA Jonnalagadda Padmavathi: శింగనమల ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే.. ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆమె మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ అసహనం వ్యక్తం చేశారు.

నా టికెట్ సంగతి జగనే చెప్పాలి..(MLA Jonnalagadda Padmavathi)

శింగనమల ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే.. ప్రతిసారి ఒక రకమైన యుద్ధమే చేయాల్సి వస్తుందని ఆమె మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ అసహనం వ్యక్తం చేశారు.జగనన్న ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతుంది.. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా అని నిలదీశారు. తనకు టికెట్ వస్తుందో రాదో జగనే చెప్పాలన్నారు.2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకు అంత అన్యాయం జరుగుతోందని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని ఉండాలా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలా అయితే నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక్క రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేస్తే తాను ఎమ్మెల్యే కాలేదని.. కులాలకు, మతాలకు అతీతంగా తనను శింగనమల ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా అంటూ పద్మావతి ప్రశ్నించారు.ఇరిగేషన్  అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కనీసం ఒక్క చెరువుకయినా నీరు విడుదల చేయాలంటూ అడిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి పరిస్దితే ఇప్పుడూ ఉందన్నారు.