YSRCP Complaint: నారాయణ విద్యాసంస్దలపై ఎన్నికల కమీషన్ కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
నెల్లూరు జిల్లాలోని నారాయణ గ్రూప్ విద్యార్థుల కుటుంబ సభ్యుల డేటాను సేకరిస్తోందని ని ఫిర్యాదు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసింది.వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వృత్తిపరమైన కళాశాలలతో కూడిన నారాయణ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా రంగంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. వారి విద్యా సంస్థల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల నుండి వ్యక్తిగత డేటా సేకరణలో నిమగ్నమై ఉన్నాయని తెలిపింది.
YSRCP Complaint: నెల్లూరు జిల్లాలోని నారాయణ గ్రూప్ విద్యార్థుల కుటుంబ సభ్యుల డేటాను సేకరిస్తోందని ని ఫిర్యాదు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసింది.వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వృత్తిపరమైన కళాశాలలతో కూడిన నారాయణ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా రంగంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. వారి విద్యా సంస్థల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల నుండి వ్యక్తిగత డేటా సేకరణలో నిమగ్నమై ఉన్నాయని తెలిపింది.
చర్యలు తీసుకోవాలి..( YSRCP Complaint)
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951, భారతీయ శిక్షాస్మృతి, మోడల్ ప్రవర్తనా నియమావళి మరియు ఆర్టికల్ 19 మరియు 21 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన ఎన్నికల అధికారిని కోరింది. విద్యార్థుల నుండి సేకరించిన మొత్తం డేటాను అందజేయాలని, ఈ మేరకు నారాయణ విద్యా సంస్థలు , సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనికి బాధ్యులైన వ్యక్తులను శిక్షించి డిబార్ చేయమని వైఎస్సార్సీపీ అభ్యర్థించింది.
నారాయణ విద్యాసంస్దల అధినేత నారాయణ గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసారు. అమరావతికి భూముల సేకరణ, అభివృద్ది తదితర అంశాల్లో కీలకపాత్ర పోషించారు. ఈ విషయంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అమరావతి అక్రమాస్తుల కేసు, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో ఆయన నిందితునిగా ఉన్నారు.