Hyderabad: తెలంగాణలో రెండు ఆర్టీసి డిపోలు మూసివేత
ప్రజల మన్ననలు పొందేందులో తెలంగాణ ఆర్టీసి వెనుకబడింది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ తీరు కూడా ఉండడంతో రాష్ట్రంలో పలు డిపోల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా గ్రేటర్ జోన్ పరిధిలో రెండు ఆర్టీసీ డిపోలను మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు
Hyderabad: ప్రజల మన్ననలు పొందేందులో తెలంగాణ ఆర్టీసి వెనుకబడింది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ తీరు కూడా ఉండడంతో రాష్ట్రంలో పలు డిపోల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా గ్రేటర్ జోన్ పరిధిలో రెండు ఆర్టీసీ డిపోలను మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
భాగ్యనగరంలోని రాణిగంజ్ లోని రెండు డిపోలను ఒకటిగా, ముషీరాబాద్ లోని రెండు డిపోలో మొదటి డిపోను విలీనం చేస్తూ ఆర్టీసి యాజమాన్యం పేర్కొనింది. మూసివేసిన డిపోలకు చెందిన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందిని పలు డిపోలకు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రేపటిలోగా మూసివేత ప్రక్రియను పూర్తి చేయలన్నారు. బదిలీ చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వారు కోరుకున్న డిపోలలో విధులు కేటాయించాలని పేర్కొన్నారు.
ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసి యాజమాన్యం 96 డిపోలను మూసివేత, విలీనాలు ప్రక్రియను చేపట్టింది. ఆర్టీసిని బలోపేతం చేసేందులో భాగంగానే ఈ చర్యలు తీసుకొంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఉద్యోగ సంఘాల మాత్రం ఆర్టీసీలో కొత్త నియమకాలు లేకుండా చేసేందులో భాగంగానే తీసుకొంటున్న చర్యలుగా భావిస్తున్నారు. అంతేగాకుండా ఇవ్వాల్సిన 5 డిఏలను కూడా ప్రభుత్వం ఇంకా ఆర్టీసి సిబ్బందికి ఇవ్వలేదు.
సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకొంటున్న సీఎం కేసిఆర్ అండ్ టీం తొలి నుండి ఆర్టీసి పై వివక్ష చూపుతూనే ఉన్నారు. ఒక దశలో వారి కోర్కెలను అణిచివేసే స్థాయిలో కేసిఆర్ ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నించి ఉంది.
ఇది కూడా చదవండి: MGM Hospital: వరంగల్ ఎంజీఎంలో త్రాచుపాము.. హడలెత్తిన రోగులు