Shubhanshu Shukla: రేపు అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా!

Axiom4 Mission Launch On Tomorrow: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడిన రాకెట్ ప్రయోగాన్ని తాజాగా రేపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. యాక్సియం-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుందని నాసా ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. రేపు మధ్యాహ్నం 12.01 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది.
కాగా వాతావరణం, పలు సాంకేతిక కారణాలతో ఆక్సియం-4 ప్రయోగం వాయిదా పడింది. తాజాగా రేపు రాకెట్ ప్రయోగం చేయనుంది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్త యాక్సియం స్పేస్ మిషన్ నిర్వహిస్తోంది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. ఈ స్పేస్ క్యాప్సుల్ ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. 28 గంటల అనంతరం వ్యోమనౌక అంతరిక్షకేంద్రానికి కనెక్ట్ అవతుంది. దాదాపు 14రోజులపాటు శుభాంశు శుక్లా అంతరిక్షంలో ఉండనున్నారు.