Published On:

Poco F7 5G Lunch: మార్కెట్లో ప్రకంపనలు.. 7,550mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్ టైమ్ వచ్చేసింది

Poco F7 5G Lunch: మార్కెట్లో ప్రకంపనలు.. 7,550mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్ టైమ్ వచ్చేసింది

Poco F7 5G Lunched Today: పోకో F7 5జి ఈరోజు భారతదేశం, ప్రపంచ మార్కెట్లలో లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందు, షియోమి సబ్-బ్రాండ్ పోకో తన సోషల్ మీడియా ఛానల్స్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలను పంచుకుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC చిప్‌సెట్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,550mAh బ్యాటరీ ఉన్నట్లు నిర్ధారించింది. దీనిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటాయి. ఫోన్ లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం ఎలా, ఎక్కడ ప్రారంభమవుతుంది, అంచనా ధర ఎంత ఉండొచ్చు, పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.

 

పోకో F7 5G లాంచ్ ఈవెంట్ ఈరోజు (జూన్ 24) సాయంత్రం 5:30 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం పోకో యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మీరు దీన్ని నేరుగా YouTubeలో “పోకో ఇండియా” ఛానెల్‌లో చూడవచ్చు. ఈ ఫోన్ మూడు రంగులలో వస్తుంది — ఫ్రాస్ట్ వైట్, సైబర్ సిల్వర్ ఎడిషన్, ఫాంటమ్ బ్లాక్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

 

Poco F7 5G Expecting Price

పోకో F7 5G ధర అధికారికంగా ప్రకటించలదు, రెండింటికీ చాలా సిమిలారటీస్ ఉన్నందున చైనాలో లాంచ్ చేయబడిన Redmi Turbo 4 Pro ధర మాదిరిగానే దీని ధర ఉండవచ్చని పుకార్లు ఉన్నాయి. చైనాలో రెడ్‌మి టర్బో 4 ప్రో ప్రారంభ ధర CNY 2,199 (సుమారు రూ. 25,700) (12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్). గత సంవత్సరం, Poco F6 5G భారతదేశంలో రూ.29,999 ప్రారంభ ధరకు ప్రారంభించారు.

 

Poco F7 5G Expecting Specifications

పోకో F7 5G అనేది స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ , 12GB వరకు ర్యామ్‌తో వచ్చే శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. ఇది షియోమి హైపర్‌ఓఎస్‌పై పనిచేస్తుంది. ఇది 3 సంవత్సరాల ఆండ్రాయిడ్, 4 సంవత్సరాల సేఫ్టీ అప్‌గ్రేడ్లను పొందుతుంది. ఈ ఫోన్‌లో 50MP సోనీ IMX882 OIS వెనుక కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

 

ఈ స్మార్ట్‌ఫోన్ 7,550mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 గంటల టాక్‌టైమ్, 2 వారాల స్టాండ్‌బై టైమ్‌ను అందించగలదు. డిజైన్ గురించి మాట్లాడుకుంటే, దీనికి మెటల్ ఫ్రేమ్, రెండు వైపులా గొరిల్లా గ్లాస్ 7i ఉన్నాయి, అలాగే ఇది IP66, IP68, IP69 రేటింగ్‌లతో వాటర్, డస్ట్ ప్రూఫ్‌గా ఉంటుంది. దీనిలో 6.83-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌‌కి సపోర్ట్ చేస్తుంది. గేమింగ్‌ను మెరుగుపరచడానికి వైల్డ్‌బూస్ట్ ఆప్టిమైజేషన్ 3.0 ఫీచర్ కూడా ఉంది.

 

 

ఇవి కూడా చదవండి: