Published On:

Hero Sriram Remanded: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ!

Hero Sriram Remanded: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ!

Actor Sriram remanded for 14-days Judicial Custody in Drugs Case: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు 8 గంటల పాటు విచారించారు. ఈ మేరకు ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన జూలై 7వ తేదీ వరకు కస్టడీలో ఉండే అవకాశం ఉంది.

 

కాగా, తమిళనాడులో ఓ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని విచారిస్తుండగా.. డ్రగ్స్ విషయంపై హీరో శ్రీరామ్ పేరు బయటకు వచ్చింది. అయితే చెన్నైలో ఓ బార్ లో జరిగిన గొడవకు సంబంధించి ఏఐఏడీఎంకే నేత ప్రసాద్‌ను డ్రగ్స్ ఉపయోగించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. అసలు విషయం బయటపడింది. అసలు ఈ డ్రగ్స్ ఎవరి దగ్గర కొన్నారు.? ఎవరికి అమ్మారనేది ఆరా తీయగా నటుడు శ్రీరామ్ పేరు బయటపడింది. మొత్తం 40 సార్లకు పైగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

ఇవి కూడా చదవండి: