Vivo X200 FE Launched: మరో కెమెరా కింగ్.. వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. నమ్మలేని ఫీచర్స్

Vivo X200 FE Launched with 50mp selfie Camera: వివో X200 FE సోమవారం తైవాన్‌లో విడుదలైంది. ఇది Vivo X200 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్. నాలుగు వేర్వేరు రంగులలో వస్తుంది. జీస్ ట్యూన్ చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ దీనిలో అందించారు. మెయిన్ సెన్సార్ 50-మెగాపిక్సెల్ ఒకటి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్ , 12GB RAM +512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 6,500mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది Vivo S30 Pro Mini రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు.
ఈ ఫోన్ వివో తైవాన్ వెబ్‌సైట్‌లో జాబితా చేసింది, కానీ ప్రస్తుతం దాని ధర, లభ్యత గురించి ఎటువంటి సమాచారం ఇవ్వబడలేదు. ఈ ఫోన్ ఫ్యాషన్ పింక్, లైట్ హనీ ఎల్లో, మినిమలిస్ట్ బ్లాక్, మోడరన్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రాబోయే వారాల్లో కొన్ని ప్రపంచ మార్కెట్లలో Vivo X200 FE లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఇది జూలై 3న థాయిలాండ్‌లో ప్రారంభమవుతుంది. మలేషియాలో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
Vivo X200 FE Features And Specifications
డ్యూయల్-సిమ్ Vivo X200 FE ఆండ్రాయిడ్ 15-ఆధారంగా ఫన్‌టచ్ OS 15 పై పనిచేస్తుంది.120Hz రిఫ్రెష్ రేట్, 460ppi పిక్సెల్ సాంద్రతతో 6.31-అంగుళాల 1.5K (1,216×2,640 పిక్సెల్స్) అమోలెెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 12GB వరకు ర్యామ్, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో జత చేసి ఉంటుంది, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC ద్వారా శక్తిని పొందుతుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే, Vivo X200 FEలో జీస్-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది, ఇందులో 50-మెగాపిక్సెల్ జీస్ IMX921 మెయిన్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా ఉంది.
వివో X200 FEలో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69 రేటింగ్ ఉంది. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.4, GPS, బీడౌ, గ్లోనాస్, గెలీలియో, Qzss, A-GPS, Wi-Fi, OTG, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, డిస్టెన్స్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 6500mAh బ్యాటరీ ఉంది.