Last Updated:

Road Accident : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..  ఆర్మూర్‌ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్‌కు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో నార్సింగి మండలం

Road Accident : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఇద్దరికీ తీవ్ర గాయాలు

Road Accident : మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..  ఆర్మూర్‌ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్‌కు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతానికి చేరుకునే సరికి ఆ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శేఖర్‌ (45), యశ్వంత్‌ (11), గజ్వేల్‌కు చెందిన వృద్ధ దంపతులు మాణెమ్మ(60), బాలనర్సయ్య(65) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న కవిత, అవినాశ్‌ తీవ్రంగా గాయపడిన వారికి సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న  నార్సింగి ఎస్సై నర్సింగులు, చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను రామాయపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.