Last Updated:

Revanth Reddy: దేవుడి మీద ఒట్టేద్దాం.. ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఈ మేరకు ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు.

Revanth Reddy: దేవుడి మీద ఒట్టేద్దాం.. ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఈ మేరకు ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద.. ప్రమాణం చేద్దామా అంటూ.. మండిపడ్డారు.

ఈటలకు సవాల్..

రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఈ మేరకు ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద.. ప్రమాణం చేద్దామా అంటూ.. మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రూ. 25 కోట్లు తీసుకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. దీంతో ఈటల ఆరోపణలపై స్పందిస్తూ.. రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఈటల చేసిన ఆరోపణలు నిజమైతే.. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వస్తా.. డబ్బులు తీసుకోలేదని దేవుడిపై ఒట్టు వేస్తా. నీ ఆరోపణలు నీజమైతే నువ్ ప్రమాణం చేస్తావా అని ప్రశ్నించారు. కోట్లు తీసుకున్నట్లు ఈటల దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

భాగ్యలక్ష్మి టెంపుల్‌ వద్దంటే.. నువ్వు చెప్పిన గుడి వద్దకే వస్తా. నేను డబ్బులు తీసుకోలేదని దేవుడిపై ఒట్టేసి చెప్తా.

నా సవాల్‌ స్వీకరించి గుడికి వచ్చి ఈటల ప్రమాణం చేయాలి అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ తర్వాత మరిన్ని విమర్శలు చేశారు.

ఆరు నెలల్లో రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేస్తామని.. అలాంటిది కేసీఆర్ దగ్గర రూ. 25 కోట్లు తీసుకుంటమా? అని రేవంత్ అన్నారు.

ఈటల రాజేందర్ భాజపాలో చేరిన తర్వాత.. విచక్షణ మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి కాకుండా ఇంకెవరు కొట్లాడారు. నాపైన ఈటల చేసిన ఆరోపణకు తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వదలుచుకున్నా అని రేవంత్‌ పేర్కొన్నారు.

నా పోరాటాన్ని ఈటల కించపరిచారు. రేపు సాయంత్రం 6 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర సిద్దంగా ఉండు.

అగ్నిపరీక్షకు నేను సిద్ధంగా ఉన్నా. ఈటల తాత్కాలిక దిగజారుడు రాజకీయాలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారాయన.

అంతకు ముందు మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో ఉన్న పెద్దవాళ్ల కంటే ఎస్సీ, ఎస్టీ‌‌ , బీసీ నాయకులే మునుగోడు ఎన్నికలకు సహాయం చేసారు.

ఆ టైంలో పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ సహాయం చేయాలని అడిగా. కానీ, ఉన్నత వర్గాల వారు ఎవరు సహాయం చేయలేదు అని పేర్కొన్నారాయన.