KCR: ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది..వంద శాతం గెలుపు మనదే.. మాజీ సీఎం కేసీఆర్
KCR Comments On Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వందశాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చి నేటికీ 11 నెలలు పూర్తి కావొస్తుందని, ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పటికే తెలుసొచ్చిందన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. అంతకుముందు సినీ నిర్మాత శ్రీనివాస్ రెడ్డితోపాటు సినీ నటుడు రవితేజ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
కూలగొడతామంటూ భయపెడతారా?
కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదని, ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని విమర్శలు చేశారు. మాకు మాటలు రావని అనుకున్నారా.. ఒక్కసారి మాట్లాడడం మొదలుపెడితే రోజంతా మాట్లాడుతామని వెల్లడించారు. ప్రభుత్వం సమాజాాన్ని నిలబెట్టాలన్నారు. అంతేతప్పా కూలగొడతామంటూ భయపెడతారా? అంటూ ప్రశ్నించారు. అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదని, నిర్మించడానికి అన్నారు, గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని తెలిపారు.