Home / తెలంగాణ
ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తాజాగా సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద జరిగిన టీచర్ బైరోజు వెంకటాచారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని హతుడు వెంకటాచారి స్నేహితుడు గిరిధర్ రెడ్డిగా నిర్థారించారు.
ఎన్టీఆర్.. ఒక వైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కాగా అటువంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ముర్ము తాజాగా విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక
చట్టానికి ప్రతినిధి అయిన ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆ చట్టం చేతులకే దొరికిపోయాడు. నేరగాళ్ళని పట్టుకోవాల్సి ఎస్సై తానే నేరగాడిగా మారాడు. డ్రగ్స్‌కి కళ్ళెం వేయాల్సిన ఆ ఎస్సై ఆ మత్తు పదార్థాలే అమ్ముకోవాలని ప్లాన్ చేసి సైబరాబాద్ పోలీసులకి చిక్కాడు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ఈ వాన కబురుతో చల్లబడనున్నారు. కాగా రానున్న ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో పర్యటన చేయనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 27న రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే సభలో అమిత్ షా హాజరు కానున్నారు. అలానే ఈయన సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరనున్నారు.
ప్రజలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే ఒక్కోసారి దారి తప్పుతున్న ఘటనలను ఇటీవల ఎక్కువగా గమనించవచ్చు. మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని చెప్పే పోలీసులు.. ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. తాజాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ సీఐ ఫుల్లుగా మద్యం సేవించి హైస్పీడ్‌లో కారు నడిపి..
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బిఆర్ఎస్ పాలిటిక్స్ హీటెక్కాయి. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. పార్టీ టికెట్ లభించకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆరు నూరైనా ప్రజా జీవితంలోనే ఉంటానని రాజయ్య తాజాగా ప్రకటించారు.
తల్లి మీద ఉన్న ప్రేమతో ఓ కూతురు ఏకంగా చంద్ర మండలంపైనే ఎకరం భూమిని కొనుగోలు చేసింది. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన తల్లిపై మమకారంతో చంద్రుడిపై స్థలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేయించి, మదర్స్ డే సందర్భంగా తల్లికి గిఫ్ట్ ఇచ్చింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న (ఆదివారం) తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.