Last Updated:

Nara Chandrababu : తెదేపా చీఫ్ చంద్రబాబుపై హైదరాబాద్ లో కేసు నమోదు..

చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 341, 290, 21

Nara Chandrababu : తెదేపా చీఫ్ చంద్రబాబుపై హైదరాబాద్ లో కేసు నమోదు..

Nara Chandrababu : చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 341, 290, 21 రెడ్‌ విత్‌ 76 సీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్‌ చేసి ప్రజలను ఇబ్బందులను గురిచేశారని చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.

అలానే హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరలసెక్రెటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు. మరో వైపు చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

అక్కడ ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. వారి సూచన మేరకు ఇవాళ చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ నేత్ర పరీక్షలు చేయించుకుంటారని తెలుస్తుంది.