Home / తెలంగాణ
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్కూటీ పై నలుగురు వెళ్తుండగా.. అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఆ సమయంలోనే గుర్తు తెలియని వాహనం వారిపై నుంచి వెళ్లడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందిడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక మరొకరి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు అందుకోవాలని భావిస్తున్నారు. అందుకు గాను అలుపెరగని యోధుడిలా వరుస సభల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు గజ్వేల్, కామారెడ్డి లలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గజ్వేల్ లో నామినేషన్ దాఖలు
మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరు ఎన్నికల ప్రచారంలో ఉండగా కేటీఆర్ ప్రచార రధం నుంచి కింద పడటంతోస్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రచార రధం రెయిలింగ్ ఊడిపోయి కేటీఆర్ కింద పడ్డారు. కేటీఆర్ తో పాటు ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడ కింద పడటంతో వారికి కూడా గాయాలయ్యాయి.
లండన్ మేయర్ ఎన్నికలలో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త తరుణ్ గులాబీ బుధవారం హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గులాటీ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాల్సిందిగా పవన్ ని కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో
తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. రేపటితో గడువు ముగియనుండగా మంచి రోజు కావడం వల్ల గురువారం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేయగా, సీఎం కేసీఆర్ నేడు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 8 వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ఖమ్మంలోని ఇల్లు,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 8మంది అభ్యర్థులకి జనసేనాని పవన్ కళ్యాణ్ బి ఫాంలని అందజేశారు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ పొత్తులో భాగంగా.. జనసేనకు 8 సీట్లను కూడా బీజేపీ కేటాయించింది. అయితే.. ఆ సీట్లకు సంబంధించిన అభ్యర్థులను జనసేన అధిష్టానం ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలోనే పలువురు టికెట్ రాని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత మాత్రం టికెట్ రాలేదని ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లో తనపై, తన సంస్థలపై, తన కుటుంబ సభ్యుల ఇళ్ళపై ఐటి, ఈడీ దాడులు జరుగుతాయని ఆయన చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నాయని పొంగులేటి మండిపడ్డారు.