Home / తెలంగాణ
ప్రజలందరికీ ముందుగా "వినాయక చవితి" శుభాకాంక్షలు. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చతుర్ధి వేడుకలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అయితే సిటీ వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలన్నది తన కల అని చెప్పారు. ఈ సందర్బంగా సోనియాగాంధీ తెలంగాణకు ఆరు గ్యారంటీ పధకాలను ప్రకటించారు. అవి
: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ.. భారత్ లో అంతర్భాగమయిందని సీఎం కేసీఆర్ అన్నారు. అమర వీరులకు నివాళులు అర్పించిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరులకు ముందుగా వందనం చేశారు. రజాకార్లపై పోరాడి అమరులయిన వారికి నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ముందుగా సీఎం కేసీఆర్.. మోటర్లను ఆన్ చేసి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు.
హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
: ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, కేంద్రాన్ని డిమాండు చేసింది.
హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో 8మంది నిందితులని పోలీసులు రిమాండుకి తరలించారు. వీరిని ఈ నెల 13న అరెస్ట్ చేశారు. మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ముగ్గురు నైజీరియా దేశస్తులని అదుపులోకి తీసుకున్నాం పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు.. 16వ తేదీ రాత్రికే రాష్ట్రానికి రానున్నారు. రాత్రి 7గంటల 20 నిమిషాలకి శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు.
దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు.