Last Updated:

Janasena chief Pawan Kalyan: నేడు వరంగల్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

:నేడు పవన్ కళ్యాణ్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. బీజేపీ నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభలో సేనాని పాల్గొననున్నారు. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన అధినేత ప్రచారం నిర్వహించనున్నారు. వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థి రావు పద్మ, వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావులకు మద్దతుగా సభ ఏర్పాటు చేశారు.

Janasena chief Pawan Kalyan: నేడు వరంగల్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena chief Pawan Kalyan:నేడు పవన్ కళ్యాణ్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. బీజేపీ నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభలో సేనాని పాల్గొననున్నారు. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన అధినేత ప్రచారం నిర్వహించనున్నారు. వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థి రావు పద్మ, వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావులకు మద్దతుగా సభ ఏర్పాటు చేశారు.

పవన్ షెడ్యూల్ ఇదీ..(Janasena chief Pawan Kalyan)

జన సేనాని ప్రచారంతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉందని స్థానిక బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. పవన షెడ్యూల్ ఖరారు అయిన దగ్గరి నుంచి బీజేపీ నేతల్లో ఫుల్ జోష్ పెరిగింది.మరోవైపు జనసేనాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 22న వరంగల్‌, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక 23న తాండూర్, 24న కూకట్ పల్లి, 25న ఎల్‌బి నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.26న కూకట్ పల్లిలో జరిగే జనసే బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మోదీతో కలిసి పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొనే అవకాశాలున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి. తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ పొత్తులో భాగంగా.. జనసేనకు 8 సీట్లను కూడా బీజేపీ కేటాయించింది.దీనితో జనసేన తరపున పోటీచేసే అభ్యర్దులకు పవన్ కళ్యాణ్ ఈ నెల 8న బి ఫాంలు అందజేసారు.