Home / తెలంగాణ
ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడి కొండల వెంకటేశ్వరరావు శుక్రవారం బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ రాఘవేంద్ర రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు ఆయనను ఘనంగా సత్కరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు సందర్శించారు. హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు వెళ్లారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్ట్ బ్రేక్ వేసింది. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జనవరి 11 వరకు సినిమా రిలీజ్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ను క్యాన్సల్ చేస్తూ తీర్పునిచ్చింది.
అర్హులైన దరఖాస్తుదారులందరికీ ప్రభుత్వ పధకాలు అందుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్‌కి చెందిన ఇంటిని ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలివి.
సీఎం రేవంత్ రెడ్డి అభయ హస్తం లోగోను విడుదల చేశారు. ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఆవిష్కరించారు.ఆరు పథకాలకు ఒకే దరఖాస్తు ఉంటుందని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో ట్రేడ్ యూనియన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ ఆసిఫ్‌పై కేసు నమోదు చేశారు. కానీ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కారు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రధాని మోదీని మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధానితో వారు మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చించారు.
మామూలుగా అయితే ప్రేమకి, ఆపై పెళ్ళికి నిరాకరించిందని ప్రియురాలిపై పగ తీర్చుకునే ప్రియుళ్ళని చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మాజీ ప్రేమికుడి మీద పగ సాధించేందుకు ఓ యువతి అతడిని తప్పుడు కేసులో ఇరికించాలనుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలివి.