Hyderabad Metro: క్రికెట్ మ్యాచ్ ఎఫెక్ట్.. ఒక్కరోజే మెట్రోలో 3.5 లక్షల మంది ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైళ్లు ఆదివారం కిటకిటలాడాయి. ఆదివారం ఒక్క రోజే 3.5 లక్షల మంది మెట్రో ప్రయాణం చేసారు. దీనికి కారణం ఉప్పల్ లో జరిగిన భారత్-ఆసీస్ ల మధ్య మ్యాచ్ జరగడమే కారణం. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు.
Hyderabad: హైదరాబాద్ మెట్రో రైళ్లు ఆదివారం కిటకిటలాడాయి. ఆదివారం ఒక్క రోజే 3.5 లక్షల మంది మెట్రో ప్రయాణం చేసారు. దీనికి కారణం ఉప్పల్ లో జరిగిన భారత్-ఆసీస్ ల మధ్య మ్యాచ్ జరగడమే కారణం. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చారు.
వారి సౌకర్యార్థం నిన్న హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ట్రిప్పులు నడిపింది. రాత్రి ఒంటి గంట వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అభిమానులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. దీనితో ఉప్పల్‌వైపు దారితీసే మెట్రో రైళ్లన్నీ మధ్యాహ్నం నుంచే కిక్కిరిసిపోయాయి. మ్యాచ్ మొదలు కావడానికి రెండు మూడు గంటల నుంచే స్టేడియానికి చేరుకునేందుకు అభిమానులు పోటెత్తడంతో మెట్రో రైళ్లు దూరేందుకు సందు లేనంతగా నిండిపోయాయి.
సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య, రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మెట్రో స్టేషన్లు అన్నీ జనసంద్రంగా మారాయి. మ్యాచ్ పూర్తయ్యాక కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉప్పల్, ఎన్‌జీఆర్ఐ స్టేషన్లు జాతరను తలపించాయి. ఈ రెండు స్టేషన్ల నుంచి మాత్రమే ఆ సమయంలో ప్రయాణికులను అనుమతించారు. అయితే, దిగేందుకు మాత్రం అన్ని స్టేషన్లలోనూ అవకాశం కల్పించారు.