Home / తెలంగాణ
Software Engineer Suicide: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కోకాపేటలో చోటుచేసుకుంది. నాగ ప్రభాకర్(27) అనే టెక్కీ హాస్టల్ 9వ భవనంపై నుంచి దూకీ బలవన్మరణం చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అప్పుల బాధల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పోలీసుల సమాచారం […]
Ponguleti Srinivas Reddy Sensational Comments: తెలంగాణలో పోలిటికల్ బాంబులు పేలే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ప్రతినిథితో మాట్లాడుతూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పెలబోతున్నాయి.. ఇందులో అందరూ ప్రధాన నేతలే ఉంటారన్నారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో పాటు పలు 10 అంశాల్లో నిజాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచబోతున్నామంటూ బాంబ్ పేల్చారు. […]
KTR Sends Legal Notice to Bandi Sanjay: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, తనని రాజకీయంగా ఎదుర్కోలేక లీగల్ నోటీసులు పంపించారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “మాజీ మంత్రి కేటీఆర్ తనకు నోటీసులు ఇచ్చినట్టు మీడియాలో చూశాను. నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవాళ్లు […]
Jupally Krishna Rao Counter to Harish Rao: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు విసిరారు. మల్లన్నసాగర్‌పై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్‌రావు చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ ఆయన కౌంటర్ ఇచ్చారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో రాష్ట్ర ఆదాయం, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు, […]
Police Land Occupied in Charminar: రాష్ట్రంలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సాధారణంగా సామాన్య ప్రజల భుముల కబ్జా చేయడం, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులు ఆశ్రయించడం వంటి సంఘటనలు రోజు ఎక్కడో దగ్గర వింటూనే ఉన్నాం. కానీ కొందరు ఏకంగా ప్రభుత్వ భూములపైనే కన్నేశారు. అదీ కూడా పోలీసులకు కేటాయించిన భూములను ఆక్రమించిన సంఘటన హైదరాబాద్ పోలీసుల స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది. నగరంలోని చార్మినార్‌లో పోలీసు స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం 700 గజాల స్థలం […]
TSPSC Group 1 Mains exam Issue: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రోడ్డు ఎక్కారు. ఈ నెల 21 నుంచి జరగాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని రాత్రి అశోక్ నగర్లో ఆందోళన చేపట్టారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో తప్పులు, జీఓ 29ను సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా వందల మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే అక్కడికి […]
Harish Rao: పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావ్ ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన ఎక్స్ వేదికగా మోదీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ పట్ల ఎందుకీ వివక్ష అని మండిపడ్డారు. గుజరాత్ పత్తికి మద్దతు ధరగా రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం, తెలంగాణలో పండిస్తున్న పత్తికి రూ.7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గమని పేర్కొన్నారు. “One Nation, One […]
TS News: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రిలీఫ్ నిరాకరించడంతో తెలంగాణకు చెందిన ఆల్ ఇండియా సర్వీస్ (ఐఏఎస్) సీనియర్ అధికారులు మంగళవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్‌ను మూవ్ చేయాలని నిర్ణయించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు అధికారులు క్యాట్ తలుపులు తట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏఐఎస్ అధికారులను డీఓపీటీ ఆదేశాలను పాటించి, ఏ రాష్ట్రాలకు అపాయింట్ చేశామో ఆ రాష్ట్రాలకు నివేదించాలని […]
Telangana High Court Green Signal For Group-1 Mains: తెలంగాణలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు పరీక్ష నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, ఈ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథావిధిగా జరగనున్నాయి. గ్రూప్- […]
TGSRTC MD VC Sajjanar: తెలంగాణలో బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. 2003లో జీఓల 16 ప్రకారం.. స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండగ దృష్ట్యా ఛార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రతి రోజు 500 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపుతున్నట్లు తెలిపారు. అయితే […]