Home / తెలంగాణ
మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా… తండా వాసులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ వారు నిరసన తెలిపారు.
హైదరాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కె మాధవి లత పై కేసు నమోదైంది . పోలింగ్ బూత్ వద్ద, బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, వారి ముసుగును తీయమని కోరడం పై ఎంఐఎం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవిలత తలపడుతున్నారు.
ఏపీలో ఓటరు చైతన్యం పోటెత్తుతోంది. ఉదయం పదకొండు గంటలవరుకు 25 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జన సందడి నెలకొంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
షర్మిలకు సొంతగా పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదు. కానీ, ప్రశాంత్ కిశోర్.. పదేపదే వచ్చి సలహాలు ఇవ్వడంతో పార్టీ పెట్టారని షర్మిల భర్త బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్య చేసారు .తాజాగా బ్రదర్ అనిల్ కుమార్.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ మాదిరి కాంగ్రెస్‌కు సర్జికల్ దాడులు చేసే ధైర్యం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. శనివారం వికారాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు.
దరాబాద్ నగరం సంక్రాంతి సెలవుల రోజులను తలపిస్తుంది .ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ, తెలంగాణ ఓటర్లు స్వస్థలాల బాటపడుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు నగరంలోని బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొంది.
జూన్ 4న దేశం గెలుస్తుందని, 140 కోట్ల మంది సంకల్పం నెరవేరుతుందని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే పాత రోజులను ఆహ్వానించినట్లే.. దేశం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకూడదని అన్నారు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది . ఓ స్కూల్ లోని స్విమ్మింగ్ పూల్ లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని నాగిరెడ్డిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సుజాత స్కూల్ లో ఈ ఘటన జరిగింది .
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏ1గా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు. ఓ ఛానల్ యజమానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. నాంపల్లి కొర్టులో రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ కొనసాగుతుంది. సమాచారం ధ్వంసం చేయడంలో ప్రభాకర్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది.