Land Occupied: షాకింగ్.. పోలీసు డిపార్ట్‌మెంట్ స్థలం కబ్జా – ఎక్కడంటే!
Police Land Occupied in Charminar: రాష్ట్రంలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సాధారణంగా సామాన్య ప్రజల భుముల కబ్జా చేయడం, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులు ఆశ్రయించడం వంటి సంఘటనలు రోజు ఎక్కడో దగ్గర వింటూనే ఉన్నాం. కానీ కొందరు ఏకంగా ప్రభుత్వ భూములపైనే కన్నేశారు. అదీ కూడా పోలీసులకు కేటాయించిన భూములను ఆక్రమించిన సంఘటన హైదరాబాద్ పోలీసుల స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది.
నగరంలోని చార్మినార్‌లో పోలీసు స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం 700 గజాల స్థలం కేటాయించింది. ఖాళీ ఉందని ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేయడమే కాదు దర్జాగా అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమైన పోలీసులు వారిని హెచ్చరించిన లెక్క చేయలేదు. దీంతో పోలీసులు అయిదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.