AIMIM : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రియాజ్

AIMIM : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ పార్టీ ప్రకటించింది. 2009లో నూర్ ఖాన్ బజార్, 2016లో డబిర్‌పురా కార్పొరేటర్‌గా మీర్జా రియాజ్ గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం అవకాశం కల్పించింది. 2023లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తయింది. పార్టీ మళ్లీ తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చింది.
ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ..
ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావును అధిష్ఠానం ప్రకటించింది. ఇప్పటి వరకు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండబోమని స్పష్టం చేసింది. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం అభ్యర్థి నామిషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఎన్నికల్లో పాల్గొంటారు.
110 మంది ఓటర్లు..
నగరంలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 110 మంది ఓటర్లు ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల్లో ఆరు మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎంఐఎం నుంచి ఒక ఎంపీ, ఏడు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. 40 కార్పొరేటర్లతో కలిపి 49 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎంపీ, నాలుగు ఎమ్మెల్సీలు, రెండు ఎమ్మెల్యేలు, 7 కార్పొరేటర్లతో కలిపి 14 ఓటర్లు, బీఆర్ఎస్ నుంచి 25 మంది ఓటర్లు, బీజేపీ నుంచి 22 ఓటర్లు ఉన్నారు.