Last Updated:

KTR: రేవంత్, బండి సంజయ్ పై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా

KTR: టీఎస్ పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని సిట్ ఇదివరకే నోటీసులు జారీ చేసింది.

KTR: రేవంత్, బండి సంజయ్ పై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా

KTR: టీఎస్ పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని సిట్ ఇదివరకే నోటీసులు జారీ చేసింది. తాజాగా వారిపై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.

రూ. 100 కోట్ల దావా..

టీఎస్ పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు.

వాటిపై వివరణ ఇవ్వాలని సిట్ ఇదివరకే నోటీసులు జారీ చేసింది. తాజాగా వారిపై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్టు ఆ నోటీసులో పేర్కొన్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో వారు చేసిన అసత్య ఆరోపణలపై బహిరంగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే నా పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారు.

సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న నా పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతో బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు.

ప్రజాప్రతినిధులుగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ఆరోపణలు చేసే హక్కు వారికి లేదు.

ఐపీసీ సెక్షన్లు 499, 500 ప్రకారం పరువు నష్టం దావాకు నోటీసులు పంపించా. ఎలాంటి ఆధారాలు లేని సత్యదూరమైన ఆరోపణలు మానుకోవాలి.

ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి.

లేని పక్షంలో రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కోవాలి అని కేటీఆర్‌ వెల్లడించారు.